అందం: అఫారెస్ట్ గ్రీన్ కాఫీ టోనింగ్ ఫేస్ మిస్ట్ రివ్యూ
మీ ముఖాన్ని తొందరగా శుభ్రం చేసుకుని అందంగా కనిపించాలని మీరనుకుంటే మీ హ్యాండ్ బ్యాగ్ లో టోనింగ్ ఫేస్ మిస్ట్ ఉండాల్సిందే. దీని కారణంగా మీ చర్మ పీహెచ్ బ్యాలన్స్ సరిగ్గా ఉంటుంది. మార్కెట్లోకి వచ్చిన సరికొత్త అఫారెస్ట్ గ్రీన్ కాఫీ టోనింగ్ ఫేస్ మిస్ట్ ఎలా ఉందో ఇక్కడ చూద్దాం. ప్రోడక్ట్ వివరాలు: ఇందులో ఎలాంటి మాంసహార పదార్థాలు కలవలేదు. ఈ మేరకు ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆమోదించింది. ఇందులో ఆల్కహాల్ కూడా లేదు. మీ చర్మానికి తేమను తీసుకురావడంలో ఇది సాయపడుతుందట. అంతేకాదు, ఇది ముఖ్యంగా జిడ్డుదనాన్ని దూరం చేసి చర్మాన్ని ప్రశాంతంగా ఉంచుతుందని ప్రోడక్ట్ ని తయారు చేసిన వాళ్ళు చెబుతున్నారు.
అఫారెస్ట్ గ్రీన్ కాఫీ టోనింగ్ ఫేస్ మిస్ట్ ఇతర వివరాలు
ఈ టోనర్ ఫేస్ మిస్ట్ ఏ పదార్థాలతో తయారవుతుందంటే: గ్రీన్ కాఫీ, ద్రాక్ష గింజలు, నిమ్మ, కలబంద, గ్లిసరిన్, మెంథాల్, అల్లాంటైన్ ఇందులో ఉంటాయి. గ్రీన్ కాఫీ పదార్థాల వల్ల చర్మంపై ముడుతలు దూరమవుతాయి, కొల్లాజెన్ ఉత్పత్తి అవుతుంది. అలాగే అల్లాంటైన్ పదార్థం చర్మాన్ని పొడిబారకుండా చేస్తుంది. నిమ్మ పదార్థాలు చర్మంపై జిడ్డును దూరం చేస్తాయి. కలబంద కారణంగా చర్మం మృదువుగా మారుతుంది. ఈ ప్రోడక్ట్ ని ఎలా వాడాలి: దీన్ని ఉపయోగించే ముందు, ముఖాన్ని, మెడ భాగాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. ఆ తర్వాత ఈ టోనింగ్ ఫేస్ మిస్ట్ ని ముఖం మీదా, మెడ మీదా స్ప్రే చేయాలి. కాసేపయ్యాక మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. 100 ml ధర 849గా ఉంది.