Makhana for Diabetes: ఈ గింజలతో షుగర్ కంట్రోల్ అవుతుంది
ఈ రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా మధుమేహ రోగులు వేగంగా పెరుగుతున్నారు. తప్పుడు ఆహారపు అలవాట్లు, దిగజారుతున్న జీవనశైలి కారణంగా నేటి యువత కూడా డయాబెటిస్ వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. ఈ వ్యాధికి చికిత్స లేదు.దీనిని నియంత్రణలో ఉంచుకోవడమే మార్గం.డయాబెటిక్ పేషెంట్లు ఎప్పుడూ తమ బ్లడ్ షుగర్‌ని చెక్ చేస్తూ ఉండాలి.ఇది వ్యాధిని నివారించడానికి సహాయపడుతుంది. కెమికల్స్ తో కూడిన మందులకన్నా సహజసిద్ధమైన ఆహారంతో షుగరును నియంత్రించవచ్చని . వైద్యులు సూచిస్తున్నారు. మధుమేహంఉన్నవారు మఖానా తినాలని డాక్టర్లు సూచిస్తున్నారు. దీని ద్వారా చక్కెర స్థాయిని తగ్గించవచ్చు. మఖానా ఒక రకమైన విత్తనం. ఇది అనేక వ్యాధులను నివారిస్తుంది.
కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించడంలో మఖానా
మఖానాను, లోటస్ సీడ్స్ లేదా ఫాక్స్ నట్స్ అని కూడా అంటారు. ఇది యాంటీ డయాబెటిక్ ప్రభావాలను కలిగి ఉంటుంది. ఇది శరీరంలో గ్లూకోజ్ స్థాయిని మెరుగుపరచడంలో, కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. మీ రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతూ, తగ్గుతూ ఉంటే, మీరు తప్పనిసరిగా మీ ఆహారంలో మఖానాను చేర్చుకోవాలి.
మఖానా మధుమేహానికి దివ్యౌషధం
మఖానా ఒక తక్కువ గ్లైసెమిక్ ఆహారం. ఇందులో ఉండే స్టార్చ్ జీర్ణమై నెమ్మదిగా శరీరంలో శోషించబడుతుంది. దీని కారణంగా శరీరంలోని బ్లడ్ షుగర్ లెవెల్ అదుపులో, స్థిరంగా ఉంటుంది. మఖానాలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. ఇది కార్బోహైడ్రేట్ల మొత్తాన్ని తగ్గిస్తుంది. మఖానాలో ఉండే యాంటీ-ఆక్సిడెంట్లు శరీరంలోని కణాలను ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి రక్షిస్తాయి. ఇది ఇన్సులిన్ స్థాయిని నిర్వహిస్తుంది. మెగ్నీషియం మఖానాలో లభిస్తుంది, ఇది ఆక్సిజన్‌ను సరఫరా చేయడం ద్వారా రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
మధుమేహ రోగులు మఖానాను ఎలా తీసుకోవాలి?
1. మఖానా వేయించి తినవచ్చు. రుచిని కొద్దిగా పెంచడానికి, మీరు నెయ్యి లేదా ఆలివ్ నూనెలో వేయించచ్చు. 2. మఖానా ఏదైనా పప్పు లేదా కూరను మరింత పోషకమైనదిగా, రుచికరంగా చేస్తుంది. 3. మీరు సరైన ఆహార ప్రణాళికను అనుసరిస్తుంటే, మఖానాను వేయించిన తర్వాత, దానిని మెత్తగా రుబ్బుకుని, జొన్న లేదా మిల్లెట్ పిండితో కలిపి రోటీలా తినండి. 4. మఖానా ఖీర్, చాట్, రైతా రూపంలో కూడా చాలామంది ఇష్టపడతారు.