LOADING...
Ugadi 2026: ఈ రంగు దుస్తులు ధరిస్తే ఏడాది మొత్తం శుభఫలితాలు
Ugadi 2026: ఈ రంగు దుస్తులు ధరిస్తే ఏడాది మొత్తం శుభఫలితాలు

Ugadi 2026: ఈ రంగు దుస్తులు ధరిస్తే ఏడాది మొత్తం శుభఫలితాలు

వ్రాసిన వారు Moogati Shabari
Mar 13, 2026
06:25 pm

ఈ వార్తాకథనం ఏంటి

దక్షిణ భారతదేశంలో నూతన సంవత్సరంగా జరుపుకునే ఉగాది పండుగ ఈసారి మార్చి 19న జరగనుంది. హిందూ పంచాంగం ప్రకారం చైత్ర మాసం మొదటి రోజున ఈ పండుగను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఘనంగా నిర్వహిస్తారు. ఈ రోజున కొత్త బట్టలు ధరించడం, ఆలయ దర్శనం చేయడం, ఉగాది పచ్చడి తీసుకోవడం సంప్రదాయంగా కొనసాగుతోంది. జ్యోతిష్యుల సూచనల ప్రకారం ఈ ఏడాది ఉగాది రోజున ఎరుపు రంగు దుస్తులు ధరించడం శుభప్రదమని చెబుతున్నారు. ఒకవేళ ఎరుపు రంగు దుస్తులు లేకపోతే గోల్డ్ లేదా గోధుమ రంగు బట్టలు ధరించవచ్చని సూచిస్తున్నారు.

వివరాలు

ఇలా చేస్తే శుభాలే

ఇలా చేయడం వల్ల సంవత్సరం మొత్తం శుభఫలితాలు కలుగుతాయని నమ్మకం. అదేవిధంగా సూర్య దేవాలయాన్ని సందర్శించడం మంచిదని పండితులు సూచిస్తున్నారు. ఆలయానికి వెళ్లలేని వారు స్నానం చేసిన తర్వాత రాగి పాత్రలో నీరు తీసుకుని ఎర్రటి పూలు, కుంకుమతో అక్షింతలు వేసి తూర్పువైపు తిరిగి సూర్యునికి నమస్కరించి మంత్రాన్ని జపిస్తే కూడా శుభఫలితాలు కలుగుతాయని చెబుతున్నారు. అలాగే విష్ణు, నరసింహ, వేంకటేశ్వర దేవాలయాలను దర్శించుకోవడం శుభప్రదంగా భావిస్తారు. ఉగాది రోజున గోధుమలు దానం చేయడం, గోమాతకు గోధుమలు-బెల్లం తినిపించడం కూడా పుణ్యఫలితాలు ఇస్తాయని పండితులు చెబుతున్నారు.

Advertisement