Page Loader
Summer Dresses: సమ్మర్‌లో ఈ దుస్తులు ధరిస్తే.. మీ బాడీ కూల్ గా ఉంటుంది 
సమ్మర్‌లో ఈ దుస్తులు ధరిస్తే.. మీ బాడీ కూల్ గా ఉంటుంది

Summer Dresses: సమ్మర్‌లో ఈ దుస్తులు ధరిస్తే.. మీ బాడీ కూల్ గా ఉంటుంది 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 20, 2025
11:01 am

ఈ వార్తాకథనం ఏంటి

కాటన్ (Cotton) అనేది కేవలం మహిళలకు మాత్రమే కాకుండా, పురుషులు, పిల్లలు సహా అందరికీ వేసవి కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన వస్త్రం. ఎండ నుండి రక్షించుకోవడానికి, మహిళలు నలుపు, ఊదా రంగుల దుస్తులను తెప్పించుకోవడం మంచిది, ఎందుకంటే ఇవి అధిక ఉష్ణాన్ని ఆకర్షిస్తాయి.బదులుగా, తెలుపు వంటి లేత రంగుల బట్టలను ఎంపిక చేసుకోవచ్చు. ముఖ్యంగా కాటన్ దుస్తులు వేసుకోవడం ఆరోగ్యానికి హితంగా ఉంటుంది. రానున్న వేసవిలో ఎలాంటి దుస్తులు ధరించాలి? దీనిపై కొన్ని ముఖ్యమైన సూచనలు తెలుసుకుందాం.

వివరాలు 

వేసవికి దుస్తుల ఎంపికకు కొన్ని చిట్కాలు: 

1. కాటన్ దుస్తులు ఉత్తమమైనవి -వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచే గుణం కాటన్ బట్టలకు ఉంటుంది. అందుకే, చాలా మంది మహిళలు వీటిని ఎక్కువగా ఇష్టపడతారు. 2. పీక్ అవర్స్‌లో బయటికి వెళ్లడం తగ్గించుకోవాలి-అవసరంగా బయటికి వెళ్లాల్సి వస్తే, గొడుగు లేదా కూల్ గ్లాసెస్ ధరించడం ఉత్తమం. 3. కాటన్ అందరికీ అనువైనది-ఇది కేవలం మహిళలకు మాత్రమే కాదు, పురుషులు, పిల్లలు కూడా వేసవిలో కాటన్ దుస్తులను ప్రాధాన్యత ఇవ్వాలి. భారతీయ కాటన్ ఫాబ్రిక్స్‌లో ఖాదీ ప్రత్యేకమైనది, వేసవి కాలంలో ఇది ఉత్తమ ఎంపిక. 4. ఖాదీ దుస్తులను మహిళలు వేరే విధంగా ధరించవచ్చు-మహిళలు చీరలు, లంగా వంటి ఖాదీ దుస్తులను ఉపయోగించవచ్చు. వేసవి కాలంలో వదులుగా ఉండే దుస్తులను ఎంచుకోవడం ఉత్తమం.

వివరాలు 

వేసవికి దుస్తుల ఎంపికకు కొన్ని చిట్కాలు: 

5. టైట్ దుస్తులను నివారించండి - వేసవి కాలంలో లెగ్గింగ్స్, జీన్స్, టైట్ ప్యాంట్లు వంటి దుస్తులను దూరంగా ఉంచాలి. ఇవి శరీరానికి గాలి తగిలే అవకాశాన్ని తగ్గించి అసౌకర్యాన్ని కలిగిస్తాయి. 6. చీర వేసవిలో ఉత్తమ ఎంపిక - చాలామంది నమ్మకపోయినా, వేసవిలో చీర అత్యంత సౌకర్యవంతమైన దుస్తులలో ఒకటి. మన పూర్వీకులు వేసవిలో ఎక్కువగా కాటన్ చీరలు కట్టేవారు. 7. లాంగ్ స్కర్ట్స్ ఉపయోగించండి - మహిళలకు లాంగ్ స్కర్ట్స్ అనుకూలంగా ఉంటాయి. ఇవి పూర్తిగా కాళ్లను కప్పి, శరీరానికి తగినంత గాలిని అందించేలా సహాయపడతాయి. వీలైనంత వరకు కాటన్ దుస్తులను ధరించండి.

వివరాలు 

వేసవికి దుస్తుల ఎంపికకు కొన్ని చిట్కాలు: 

8. కాటన్ చెమటను ఇట్టే ఆబ్సార్బ్ చేస్తుంది - మన శరీరం నుండి బయటపడే చెమటను కాటన్ తక్షణమే పీల్చుకుంటుంది, తద్వారా గాలి తాకిన వెంటనే ఆరిపోతుంది. ఇది శరీరాన్ని వేడి నుండి కాపాడుతుంది. 9. సింథటిక్ దుస్తులను తగ్గించండి - వేసవిలో కొంతమందికి సింథటిక్ లేదా పాలిస్టర్ దుస్తులు ధరించడం వల్ల చర్మ సమస్యలు వస్తాయి. అయితే, కాటన్ దుస్తులతో అలాంటి సమస్యలు రావు. ఇవి అన్ని రకాల చర్మాలకు అనుకూలంగా ఉంటాయి. 10. కాటన్ వాతావరణ మార్పులను తట్టుకుంటుంది - అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లోనూ శరీరాన్ని రక్షించే సామర్థ్యం కాటన్ వస్త్రాలకు ఉంది.