Best Foods for Hair Growth: పొడవైన, ఒత్తైన జుట్టు పెరుగుదలకు 9 అద్భుతమైన సూపర్ ఫుడ్స్
ఈ రోజుల్లో మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు వల్ల అనేక ఆరోగ్య సమస్యలను వెంటాడుతున్నాయన్న సంగతి తెలిసిందే. అందులో ముఖ్యంగా, ఉద్యోగ ఒత్తిడి, కాలం పరిగణనలో తీసుకుంటే, చాలా మంది చిన్న వయస్సులోనే బీపీ, షుగర్, మధుమేహం, చర్మ, జుట్టు సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నారు. జుట్టు రాలడం అనేది ఒక ప్రధాన సమస్యగా మారింది, ఎందుకంటే జుట్టు మన రూపాన్ని అందంగా, ప్రత్యేకంగా చూపించడానికి ప్రధాన పాత్ర పోషిస్తుంది. జుట్టు రాలిపోయినప్పుడు మన ఆత్మస్థైర్యం తగ్గడం సాధారణం.
జుట్టు సంబంధిత సమస్యలు అనేకరకాలు
ఇక జుట్టు సంబంధిత సమస్యలు అనేకరకాలు ఉంటాయి. జుట్టు పలుచన, బట్టతల జుట్టు, చుండ్రు, జిడ్డుగల జుట్టు, పొడిబారిన జుట్టు. ఈ సమస్యలు చాలామంది వ్యక్తులను బాధిస్తున్నాయి. అధ్యయనాల ప్రకారం, జుట్టు ప్రతి రోజూ సుమారు 0.44 మిమీ పెరుగుతుందని అంటున్నారు. అయితే జుట్టు పెరుగుదల రేటు చాలా అంశాలపై ఆధారపడి ఉంటుంది. అవి.. మన జుట్టు కోసం తీసుకునే జాగ్రత్తలు, ఉత్పత్తులు, జుట్టు సంరక్షణ విధానాలు. జుట్టు రాలిపోవడానికి హార్మోన్ల అసమతుల్యత, ఆందోళన, ఆహార లోపాలు, జీన్స్, వాతావరణ పరిస్థితులు వంటి అనేక కారణాలు కూడా ప్రభావం చూపిస్తాయి.
సరైన ఆహారం ఎంతో కీలకం..
ఈ సమస్యను అధిగమించేందుకు సరైన ఆహారం ఎంతో కీలకమైనది. మన జుట్టు ఆరోగ్యంగా పెరిగేందుకు ప్రోటీన్లు, ఐరన్, జింక్, విటమిన్ కే వంటి పోషకాలు అవసరం. ఈ పోషకాలు మనం తీసుకునే ఆహారంలోనే లభిస్తాయి. మంచి ప్రోటీన్లు, బయోటిన్, ఐరన్, జింక్ ఉన్న ఆహార పదార్థాలు మన జుట్టును బలంగా, ఆరోగ్యంగా పెంచేందుకు సహాయపడతాయి. ఇప్పుడు మనం ఏ ఆహార పదార్థాలను తినాలో తెలుసుకుందాం.
సూపర్ గ్రీన్ ఫుడ్స్ ఇవే..
లీఫ్ క్యాబేజీ లీఫ్ క్యాబేజీలో ఫోలేట్, ప్రోటీన్, ఫైబర్, పొటాషియం, ఇతర విటమిన్లు అధికంగా ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలకు సహాయపడుతాయి. జుట్టును బలంగా, ఆరోగ్యంగా ఉంచుతాయి. పాలకూర పాలకూరలో తక్కువ కేలరీలు, అధిక యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. విటమిన్ A, C, K, ఐరన్, ఫోలేట్ జుట్టు పెరుగుదలలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. చిక్కుడు కాయలు చిక్కుడు కాయల్లో మినరల్స్, ఫైబర్ అధికంగా ఉంటాయి, ఇది జుట్టును ఆరోగ్యంగా పెంచడానికి సహాయపడుతుంది. జుట్టు సుస్థిరంగా ఉండటానికి ఇవి ఉపయోగకరంగా ఉంటాయి. క్లోరెల్లా క్లోరెల్లా ఒక రకమైన ఆల్గే, ఇందులో ప్రోటీన్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. జుట్టు పెరుగుదలలో సహాయపడుతుంది.
సూపర్ గ్రీన్ ఫుడ్స్ ఇవే..
పూదీనా పూదీనాలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి, ఇవి చుండ్రును తగ్గించి జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. గ్రీన్ పెప్పర్ గ్రీన్ పెప్పర్‌లో విటమిన్ C అధికంగా ఉంటాయి. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి, జుట్టు పెరుగుదలలో దోహదం చేస్తుంది. బ్రోకోలీ బ్రోకోలీలో విటమిన్ C, ఐరన్, కాల్షియం అధికంగా ఉంటాయి. ఇవి జుట్టు కుదుళ్లను బలంగా, ఆరోగ్యంగా ఉంచుతాయి. అవకాడో అవకాడో పండులో ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ E, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉన్నాయి. ఇవి జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి. ఈ గ్రీన్ ఫుడ్స్‌ను ప్రతిరోజూ తమ ఆహారంలో చేర్చడం ద్వారా, మీరు జుట్టు పెరుగుదల, ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు.