Travel 2025: తక్కువ ఖర్చుతో కొత్త ఏడాదిలో విదేశీ పర్యటనకు వెళ్ళండిలా..
ఈ వార్తాకథనం ఏంటి
జీవితంలో ఒకసారి అయినా విదేశాలకు వెళ్లాలని అందరూ అనుకుంటారు. ముఖ్యంగా, కుటుంబంతో కలిసి విదేశీ పర్యటన చేయాలని అనుకునే వారే ఎక్కువ.
ట్రావెలింగ్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది, కానీ ఖర్చుల గురించి ఆందోళన చెందుతారు.
ముఖ్యంగా విదేశాలకు వెళ్లడం అంటే మరింత ఆందోళన ఉంటుంది, ఎందుకంటే అనుకున్నదానికంటే ఎక్కువ ఖర్చు అవుతుందన్న భయం వారికీ ఉంటుంది.
ఈ పరిస్థితిలో, మీరు తక్కువ ఖర్చుతో, బడ్జెట్ ఫ్రెండ్లీగా విదేశీ పర్యటన చేయాలని అనుకుంటే, కొన్ని చవక దేశాల గురించి ఇచ్చాము.
2025 లో కొత్త సంవత్సరం సందర్భంగా విదేశాలకు వెళ్లాలని అనుకుంటే, మీరు ఈ దేశాలను ఎంపిక చేసి, తక్కువ ఖర్చులోనే పూర్తి చేయగలరు.
వివరాలు
వియత్నాం
వియత్నాం అనేది చాలా అందమైన దేశం. ఇక్కడ సందడిగా ఉండే నగరాలు, ప్రశాంతమైన సముద్రతీరాలు, విభిన్నమైన సంస్కృతి మనసుకు ఎంతో ఉల్లాసం ఇస్తాయి.
వీటితో పాటు, ఇక్కడి స్ట్రీట్ ఫుడ్ కూడా చాలా రుచికరంగా ఉంటుంది. ఖర్చు కూడా చాలా తక్కువ.
వియత్నం ప్రయాణానికి ఒక వ్యక్తికి విమాన టిక్కెట్ ధర 15,000 నుండి 20,000 రూపాయల మధ్య ఉంటుంది.
అక్కడ వసతి, ఆహారం కూడా చాలా చవకంగా ఉంటాయి. మీకు 1 లక్ష రూపాయలతో వియత్నం హ్యాపీగా తిరిగి రావచ్చు.
వివరాలు
శ్రీలంక
శ్రీలంక అనేది బీచ్‌లు, తేయాకు తోటలు, పురాతన దేవాలయాల కొరకే ప్రసిద్ధి చెందింది.
ఇది భారతదేశానికి సమీపంలోనే ఉంది. బడ్జెట్‌కు అనుకూలమైన పర్యాటక గమ్యం కూడా.
ఈ దేశానికి విమాన టిక్కెట్ ధర రూ.12,000 నుండి రూ.18,000 వరకు ఉంటుంది.
ఇక్కడ వసతి, రవాణా కూడా చాలా చవకగా ఉంటుంది. రోజుకు రూ.3,000 నుండి రూ.6,000 మధ్య ఖర్చవుతుంది.
వివరాలు
నేపాల్
నేపాల్ అనేది అత్యంత అందమైన దేశాలలో ఒకటి. ట్రెక్కింగ్, ఆధ్యాత్మిక స్థలాలు, మంచు పర్వత దృశ్యాలకు ప్రసిద్ధి చెందిన నేపాల్ ప్రయాణానికి రోడ్డు లేదా విమాన మార్గం ద్వారా చేరుకోవచ్చు.
ఇందులో విమాన టిక్కెట్ ధర 7,000 నుండి 10,000 రూపాయల వరకు ఉంటుంది. ఇక్కడ బస, ఆహారం అలాగే ఇతర రోజువారీ ఖర్చులు 4,000 నుండి 6,500 రూపాయల వరకు ఉంటాయి.
వివరాలు
థాయిలాండ్
థాయిలాండ్ అనేది యాత్రికులను ఎంతో ఆకర్షించే దేశం. ఇక్కడి సంస్కృతి, స్ట్రీట్ ఫుడ్, ద్వీపాలు, ప్రఖ్యాత నగరాలు - బ్యాంకాక్, ఫుకెట్, చియాంగ్ మాయి వంటి ప్రదేశాలు ఎంతో విశేషంగా ఉంటాయి. ఇక్కడ టికెట్ ధర రూ.12,000 నుండి రూ.18,000 వరకు ఉంటుంది. హాస్టళ్లు,భోజనం వంటి అనివార్య ఖర్చులు రోజుకు రూ.5,000 నుండి రూ.7,000 వరకు ఉంటాయి.
ఇండోనేషియా
ఇండోనేషియా అనేది బీచ్‌లు, దేవాలయాలు, నైట్ లైఫ్ వంటి అనేక ప్రత్యేకతలకు ప్రసిద్ధి చెందింది. బాలి వంటి ప్రదేశాలు హనీమూన్ గమ్యంగా చాలా ప్రఖ్యాతమైనవి. ఇక్కడ చేరుకోవడానికి విమాన టిక్కెట్ ధర రూ.20,000 నుండి రూ.25,000 వరకు ఉంటుంది. వసతి, ఆహారం, ఇతర ఖర్చులు రూ.4,500 నుండి రూ.7,500 మధ్య ఉంటాయి.