
Guava Benefits in Winter : శీతాకాలంలో షుగర్ పేషెంట్స్ జామకాయలు తినొచ్చా..?
ఈ వార్తాకథనం ఏంటి
శీతకాలంలో జామపండ్లు ఎక్కువగా లభిస్తాయి. జామపండు తినడం వల్ల ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి.
శరీరంలో కొవ్వును కరిగించడంతో పాటు బరువును నియంత్రించడంలో జామ గొప్ప ఔషదంగా పనిచేస్తుంది.
ఇందులో విటమన్ సి పుష్కలంగా ఉండటంతో రోగ నిరోధక శక్తిని పెంచడంలో సాయపడుతుంది.
జామపండులో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటంతో పాటు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది.
ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులకు జామ చాలా ఉపయోగకరంగా పనిచేస్తుంది.
ఇందులో మెగ్నీషియం పుష్కలంగా ఉండటంతో ఒత్తిడిని దూరం చేస్తుంది.
ఒత్తిడికి గురైనప్పుడు జామపండ్లను తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Details
చలికాలంలో జామ పండ్లు ఎక్కువగా తినాలి
ముఖ్యంగా చలికాలంలో జామ పండ్లు తప్పనిసరిగా తినాలని నిపుణులు చెబుతున్నారు.
జామపండులో ఫైబర్ పుష్కలంగా లభించడంతో పాటు జీర్ణక్రియను మెరుగుపరచడంలో సాయపడుతుంది.
అధిక బరువుతో బాధపడేవారు జామపండ్లను తినొచ్చు.
ఇందులో డైటరీ ఫైబర్ ఎక్కువగా ఉండటంతో ఇది జీవక్రియను బలపరుస్తుంది.