Ugadi 2026: ఉగాది రోజున అమావాస్య.. పండుగ చేసుకోవచ్చా..! పండితులు ఏం చెప్పారంటే?
ఈ వార్తాకథనం ఏంటి
తెలుగు ప్రజలకు కొత్త సంవత్సరం ప్రారంభం ఉగాది పండుగతోనే జరుగుతుంది. పాశ్చాత్య దేశాల్లోలాగే జనవరి 1ను న్యూ ఇయర్‌గా జరుపుకున్నప్పటికీ, తెలుగు సంప్రదాయం ప్రకారం నిజమైన కొత్త సంవత్సరం ఉగాది నుంచే మొదలవుతుంది. ఈ ఏడాది మార్చి 19న ఉగాది పండుగ రానుంది. ఈ సందర్భంగా కొత్తగా ప్రారంభమయ్యే సంవత్సరానికి పరాభవ నామ సంవత్సరమ్ అని పేరు. అయితే ఈసారి ఉగాది రోజున అమావాస్య ఘడియలు కూడా ఉన్నాయని పండితులు చెబుతున్న నేపథ్యంలో కొంతమందిలో సందేహాలు తలెత్తుతున్నాయి. పండుగను జరుపుకోవచ్చా? లేదా? అనే ప్రశ్నలు చాలా మందిని వేధిస్తున్నాయి. ముఖ్యంగా ప్రతిరోజూ పూజలు చేసే వారు ఈ విషయంలో మరింత స్పష్టత కోరుతున్నారు.
Details
మార్చి 19న ఉదయం 6 గంటల 52 నిమిషాలకు ఉగాది ప్రారంభం
పండితుల అభిప్రాయం ప్రకారం, శ్రీ పరభవ నామ సంవత్సరంలో అమావాస్య ఘడియలు ఉన్నప్పటికీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. ప్రతి ఏడాది చైత్ర శుక్ల పాడ్యమి రోజునే ఉగాది పండుగను సంప్రదాయబద్ధంగా జరుపుకుంటారు. ఈ సంప్రదాయంలో ఎలాంటి మార్పు ఉండదని కూడా వారు స్పష్టం చేస్తున్నారు. ఈ ఏడాది మార్చి 19న ఉదయం 6 గంటల 52 నిమిషాలకు ఉగాది పర్వదినం ప్రారంభమవుతుంది. అదే రోజున అమావాస్య సమయం కూడా ఉండటం వల్ల కొందరు సందేహపడుతున్నప్పటికీ, అది పండుగను ప్రభావితం చేయదని పండితులు చెబుతున్నారు. అందువల్ల ఎలాంటి భయం లేకుండా భక్తులు దేవుడికి పూజలు చేసి ఆనందంగా ఉగాది పండుగను జరుపుకోవచ్చని సూచిస్తున్నారు.