ఈస్టర్ పండగ రోజున ఆనందాన్ని అందించే అద్భుతమైన రెసిపీస్
ఈ ఏడాది ఈస్టర్ పండగ ఏప్రిల్ 9వ తేదీ ఆదివారం నాడు వచ్చింది. మరణం తర్వాత క్రీస్తు మళ్ళీ తిరిగి రావడాన్ని ఉద్దేశించి ఈ పండగను క్రైస్తవులు జరుపుకుంటారు. ఈ పండగ పూట బంధువులను, స్నేహితులను ఇంటికి ఆహ్వానించి ఆతిథ్యం అందిస్తారు. అయితే పండగ సందర్భంగా నోరూరించే స్పెషల్ రెసిపీస్ ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. క్రాస్ బన్స్ పిండి, చక్కెర, ఉప్పు, దాల్చిన చెక్క, గోరువెచ్చని నీళ్లు ఒక పాత్రలో పోసి బాగా కలపాలి. చీజ్, ఎండుద్రాక్ష, పుదీనా కలిపి పిండిముద్దను తయారు చేసుకుని పక్కన పెట్టాలి. ఈ పిండితో చిన్న చిన్న బన్స్ తయారు చేసుకుని, వాటి మీద గుడ్లను పగలగొట్టి, 30నిమిషాల పాటు ఓవెన్ లో ఉంచాలి.
స్పెషల్ చికెన్,హాట్ చాక్లెట్ తయారీ
హాట్ చాక్లెట్ ఒక కెటిల్ లో నీళ్ళు పోసి మరిగించండి. మరో పాత్రలో కోకో పౌడర్ ని, పాలను పోసి వేడి చేయండి. ఇప్పుడు కెటిల్ లోంచి నీళ్ళను తీసేసి చాక్లెట్ ఎగ్స్ వేయండి. తర్వాత పాలమిశ్రమాన్ని కెటిల్ లో వేసి 30సెకన్లు బాగా కలపండి. ఇప్పుడు హాట్ చాక్లెట్ రెడీ అయ్యింది, హ్యాపీగా తినండి. స్పెషల్ చికెన్: ఒక పాత్రలో కారం, ధన్యాల పొడి, పసుపు, ఉప్పు, చికెన్ మసాలా వేసి వేడి చేయాలి. ఈ మిశ్రమాన్ని చికెన్ ముక్కలకు జోడించి 30నిమిషాలు పక్కన పెట్టాలి. మరో పాత్రలో ఉల్లి, వెల్లుల్లి, టమాటలు బాగా వేగిన తర్వాత చికెన్ వేసి రెడీ చేయండి.