LOADING...
Motivational: ఈ సూత్రాలు పాటిస్తే… మీరే నిజమైన ధనవంతులు అవ్వగలరు
ఈ సూత్రాలు పాటిస్తే… మీరే నిజమైన ధనవంతులు అవ్వగలరు

Motivational: ఈ సూత్రాలు పాటిస్తే… మీరే నిజమైన ధనవంతులు అవ్వగలరు

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 04, 2025
04:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

చాణక్యుడు చెప్పిన సూత్రాలు,ఉపదేశాలు తరచుగా చర్చనీయాంశం అవుతాయి. ఆయన సూక్తులు ఇచ్చి వందల సంవత్సరాలు గడిచినా ఈ ఆధునిక యుగంలో కూడా చాణ్యకుడి నీతులుకు చాలా ప్రముఖ్యత ఉంది. ఇంటర్వ్యూల్లో, పర్సనాలిటీ డెవలప్‌మెంట్లల్లో చాణక్య నీతుల పై ఉండే చర్చ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆర్థిక వ్యవహారాల పైన చాణక్యుని బోధనలు మానవజీవితానికి ఎంత కీలకమో తెలిసిందే. ప్రత్యేకంగా ఆయన రచించిన "అర్థశాస్త్రం" పుస్తకం మనకు ప్రాచీన సంపద, వ్యాపార విధానాల గురించిన అమూల్యమైన మార్గదర్శకాలు అందిస్తుంది. ఆయన సూచనల ద్వారా వ్యాపారంలో, వృత్తిలో విజయం సాధించినవారి సంఖ్య ఎక్కువ. డబ్బును ఎలా సమర్థవంతంగా ఖర్చు చేయాలో, ఎలా ఆదా చేయాలో ఆయన స్పష్టంగా వివరించారు.

వివరాలు 

సంపద ఎక్కువకాలం నిలవదు 

డబ్బుపై అధిక వ్యామోహం ఉంటే, నైతికత పాటించకపోతే, ఆ సంపద ఎక్కువకాలం నిలవదని చాణక్యుడు చెప్పారు. చెడు దారిలో డబ్బులు సంపాదించినా ఆ డబ్బు ఎక్కువ కాలం నిలవదన్నాడు. ఇతరులను గౌరవించకపోవడం, అవమానించడం వంటి చర్యలు కూడా సంపదను లాంగ్-టర్మ్‌గా నిలవనివ్వవు. అలాంటి వ్యక్తికి మరిన్ని కష్టాలు తప్పవు.

వివరాలు 

డబ్బు గురించి చాణక్యుడు చెప్పిన విషయాలు.. 

డబ్బు, అంటే లక్ష్మీ దేవి, ఎప్పుడూ ఒకే చోట ఉండదు. దొంగతనం, మోసం, జూదం, అన్యాయం ద్వారా సంపాదించిన డబ్బు ఎక్కువకాలం నిలవదు. కాబట్టి ధనం పొందడానికి తప్పుదారులను ఎంచుకోవద్దు. కొందరు అనుభవిస్తున్న పేదరికం, వ్యాధులు, సమస్యలు వారి తప్పుదారుల ఫలితమే. మంచి పనులు చేస్తే మంచి ఫలితం వస్తుంది. డబ్బు లేని వ్యక్తులను తక్కువగా భావించకూడదు. ధనసంపత్తి లేకపోవడం తెలివి లేకపోవడం కాదు. వినయాన్ని పరిగణనలోకి తీసుకోకపోవడం, గౌరవం చూపించకపోవడం మానవ జీవితాన్ని పేదగా చేస్తుంది అని చాణక్యుడు తెలిపారు.

వివరాలు 

డబ్బు గురించి చాణక్యుడు చెప్పిన విషయాలు.. 

సంపాదనతోపాటు, క్రమం తప్పకుండా దానం చేయడం వలన పేదరికం తన ఇంటిని చేరదు. అయినప్పటికీ అధికంగా దానం చేయడం కూడా మంచిది కాదని ఆయన చెప్పారు. ధనికులు, వ్యాపారులు, మేధావులు, వైద్యులు వంటి గౌరవప్రద వ్యక్తులు ఉన్న చోటే ఆర్థిక స్థిరత్వం ఎక్కువగా ఉంటుంది. డబ్బు సంపాదించవచ్చు, కానీ ఆత్మగౌరవం సంపాదించకపోతే నిజమైన సంపద అసాధ్యం. నిజమైన సంపన్నుడు అనేది ఆత్మగౌరవం కలిగిన వ్యక్తి అని చాణక్యుడు స్పష్టంగా చెప్పారు.