LOADING...
Motivational: ఈ ఐదు సూత్రాలను పాటిస్తే శత్రువులను జయించడం ఖాయం.. 
ఈ ఐదు సూత్రాలను పాటిస్తే శత్రువులను జయించడం ఖాయం..

Motivational: ఈ ఐదు సూత్రాలను పాటిస్తే శత్రువులను జయించడం ఖాయం.. 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 03, 2025
03:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

చాణక్యుడు అంటే తెలివి, వ్యూహం,రాజకీయం అన్నీ కలిపిన ప్రతిరూపం. మౌర్య సామ్రాజ్యాన్ని నిర్మించిన ఆయన, "చాణక్య నీతి" ద్వారా జీవనంలోని అన్ని రంగాల్లో విజయం సాధించే మార్గదర్శక సూత్రాలను ఇచ్చాడు. ఆయన చెప్పిన ఉపాయాలు అప్పట్లో ఎంత ప్రాముఖ్యంగా ఉన్నాయో, ఈ రోజుకీ అంతే విలువైనవిగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా శత్రువులను ఎదుర్కోవడం, సవాళ్లను అధిగమించడం విషయంలో ఆయన ఆలోచనలు మనకు సరైన మార్గాన్ని చూపెడతాయి.

వివరాలు 

1. శత్రువును ఎప్పుడూ తక్కువగా అంచనా వేయొద్దు 

చాణక్యుడి అభిప్రాయం ప్రకారం, శత్రువు ఎంత బలహీనంగా కనిపించినా అతన్ని నిర్లక్ష్యం చేయడం ప్రమాదకరం. కొన్నిసార్లు అతి పెద్ద దెబ్బలు ఊహించని వ్యక్తుల నుండి వస్తాయి. ఈ రోజు బలహీనుడిగా ఉన్నవాడు, రేపటికి శక్తివంతుడవుతాడు. కాబట్టి ఎప్పుడూ అప్రమత్తంగా, సిద్ధంగా ఉండడం తప్పనిసరి. 2. ప్రశాంతతే శక్తి మనసును శాంతంగా ఉంచగలిగినవారే సరైన నిర్ణయాలు తీసుకోగలరని చాణక్యుడు చెబుతాడు. కోపానికి లోనుకాకుండా ఉన్నప్పుడు, శత్రువు చేసే ప్రతి కదలిక స్పష్టంగా గమనించగలం. ప్రశాంతత మనల్ని శత్రువుపై ఒక అడుగు కాదు, అనేక అడుగులు ముందుకు తీసుకువెళ్తుంది.

వివరాలు 

3. శత్రువుల ప్రతి కదలికను గమనించడం

చాణక్య నీతిలోని మరో ముఖ్యమైన సూచన ఏమిటంటే.. శత్రువుల ప్రతి కదలికను గమనించడం. మన సమాచారాన్ని బయటపెట్టకుండా, అమాయకుడిగా కనిపించడం ఒక వ్యూహంగా ఉపయోగపడుతుంది. అలా కనిపిస్తే, శత్రువు మనల్ని తక్కువ అంచనా వేసి పొరపాట్లు చేసే అవకాశం ఉంటుంది. 4. సరైన సమయాన్ని గుర్తించాలి విజయం సాధించాలంటే సరైన సమయంలోనే చర్యలు తీసుకోవాలని చాణక్యుడు చెబుతాడు. పరిస్థితి అనుకూలం కాకపోతే కొంతకాలం వెనక్కి తగ్గడం కూడా వ్యూహంలో భాగమే. తొందరపాటు నిర్ణయాలు నష్టాన్ని కలిగిస్తాయి. ఎప్పుడు, ఎక్కడ, ఎలా దాడి చేయాలో తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం.

వివరాలు 

5. సలహా తీసుకోవడంలో తప్పు లేదు 

ప్రతి ఒక్కరూ అన్నింటినీ తెలుసుకోలేరని చాణక్యుడు నమ్మాడు. అందుకే అనుభవజ్ఞులైనవారి సలహా తీసుకోవడం అత్యంత బలమైన మార్గం. అహంకారాన్ని వదిలేసి, పరిజ్ఞానం కలిగిన వారిని సంప్రదిస్తే ప్రణాళిక మరింత బలపడుతుంది. ఇది నాయకత్వంలోనూ, నిర్ణయాలు తీసుకోవడంలోనూ అపారమైన సహాయాన్ని అందిస్తుంది.