LOADING...
'China's first father': సరోగసీ ద్వారా 100+ సంతానం.. ఎలాన్ మస్క్ కుటుంబంతో సంబంధాలు కలుపుకోవాలని చైనా బిలియనీర్ కల
ఎలాన్ మస్క్ కుటుంబంతో సంబంధాలు కలుపుకోవాలని చైనా బిలియనీర్ కల

'China's first father': సరోగసీ ద్వారా 100+ సంతానం.. ఎలాన్ మస్క్ కుటుంబంతో సంబంధాలు కలుపుకోవాలని చైనా బిలియనీర్ కల

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 16, 2025
03:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలో సరోగసీ ద్వారా వందకు పైగా పిల్లలకు తండ్రిగా మారిన ఒక చైనా బిలియనీర్,తన పిల్లల్లో కొందరిని టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ కుటుంబంలోకి వివాహం చేయాలన్న ఆశతో ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు జూ బో (48). చైనాలో ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీ 'డుయోయి'ని స్థాపించి భారీ సంపద సంపాదించిన జూ బో,తన వారసత్వాన్ని విస్తరించాలన్న ఆలోచనతో ఎక్కువ మంది సంతానం కలగాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. తనను తానే "చైనాకు తొలి తండ్రి"గా చెప్పుకుంటున్న జూ బో,కనీసం "50 మంది మంచి నాణ్యత గల కుమారులు" కావాలన్న లక్ష్యాన్ని సోషల్ మీడియాలో బహిరంగంగా ప్రకటించాడు. ఈ పోస్టులను వాల్ స్ట్రీట్ జర్నల్ ధృవీకరించింది.

వివరాలు 

జూ బో చైనా గేమింగ్ వ్యాపారి

డుయోయి కంపెనీ కూడా ఒక సోషల్ మీడియా పోస్టులో, అమెరికాలో సరోగసీ ద్వారా జూ బోకు ఇప్పటికే 100 మందికి పైగా పిల్లలు పుట్టారని తెలిపింది. ఈ కథ మరింత సంచలనంగా మారింది, జూ బో మాజీ ప్రేయసి టాంగ్ జింగ్ చేసిన ఆరోపణలతో. జూ బోకు 300 మందికి పైగా పిల్లలు ఉన్నారని, వాటిలో 11 మందిని తానే ఎన్నో ఏళ్ల పాటు పెంచానని ఆమె వెల్లడించింది. "ఈ సంఖ్య తక్కువగా ఉండొచ్చు కానీ ఎక్కువగా చెప్పినదేమీ కాదు" అని ఇండియా టైమ్స్ పేర్కొన్నట్టు జింగ్ సోషల్ మీడియాలో రాసింది. ఇప్పుడు జూ బో, టాంగ్ జింగ్‌తో కలిసి పెంచిన ఇద్దరు కుమార్తెల కస్టడీ విషయంలో కోర్టులో న్యాయపోరాటం చేస్తున్నాడు.

వివరాలు 

జూ బో దాఖలు చేసిన పలు దరఖాస్తులను పరిశీలించిన కాలిఫోర్నియా కోర్టు

గత కొన్ని సంవత్సరాలుగా తన మాజీ ప్రేయసి అవసరాల కోసం ఖర్చుల రూపంలో పదుల కోట్ల రూపాయలు చెల్లించానని జూ బో తెలిపాడు. అయితే తనకు వందల మంది పిల్లలు ఉన్నారన్న జింగ్ ఆరోపణలను మాత్రం ఆయన సవాలు చేయలేదు. పెద్ద కుటుంబ వంశాన్ని నిర్మించాలన్న జూ బో ఆశలకు, జనాభా పెరుగుదలపై ఎలాన్ మస్క్ వ్యక్తపరిచే అభిప్రాయాలే ప్రేరణగా మారాయని కథనాలు చెబుతున్నాయి. మస్క్ తన జన్యు పదార్థంతో మరింత మంది పిల్లలు పుట్టాలని తనకు దగ్గర వారిని ప్రోత్సహించాడని కొన్ని నివేదికలు పేర్కొన్నా, ఆ ఆరోపణలను మస్క్ బహిరంగంగా ఖండించాడు. 2023 మధ్యలో కాలిఫోర్నియా కోర్టు, జూ బో దాఖలు చేసిన పలు దరఖాస్తులను పరిశీలించింది.

Advertisement

వివరాలు 

పురుష వారసులకే కంపెనీ..

అందులో నలుగురు గర్భంలో ఉన్న పిల్లలతో పాటు,సరోగసీ ద్వారా పుట్టబోయే కనీసం ఎనిమిది మంది పిల్లలపై సంరక్షణ హక్కులు కోరుతూ ఆయన పిటిషన్లు వేశారు. కేసు సున్నితమైనదని భావించిన న్యాయమూర్తి, విచారణను గోప్యంగా కొనసాగించాలని నిర్ణయించారు. వర్చువల్‌గా హాజరైన జూ బో, అమెరికాలో కనీసం 20మంది పిల్లలకు తండ్రిగా మారాలని భావిస్తున్నానని, భవిష్యత్తులో తన కంపెనీ నియంత్రణ పురుష వారసులకే ఉండాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అయితే కోర్టు జూ బో అభ్యర్థనలను తిరస్కరించింది.దీని వల్ల గర్భంలో ఉన్న పిల్లలకు సంబంధించిన చట్టపరమైన అంశాలు ఇప్పటికీ తేలలేదు. ఈకేసు,అమెరికాలో సరోగసీ ద్వారా పిల్లలను కనడానికి సహాయం చేసే సంస్థల నెట్‌వర్క్‌ ఎలా సంపన్న చైనా వ్యాపారులకు తోడ్పడుతోందన్న విషయాన్ని కూడా వెలుగులోకి తీసుకొచ్చింది.

Advertisement