LOADING...
Chinese boss: లాభాల్లో 70% స్టాఫ్‌కే.. బాస్ గోల్డెన్ గిఫ్ట్
లాభాల్లో 70% స్టాఫ్‌కే.. బాస్ గోల్డెన్ గిఫ్ట్

Chinese boss: లాభాల్లో 70% స్టాఫ్‌కే.. బాస్ గోల్డెన్ గిఫ్ట్

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 26, 2026
02:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

చైనాలో ఓ కంపెనీ బాస్ తన ఉద్యోగులకు ఏకంగా రూ.240 కోట్ల బోనస్‌లు పంచి సంచలనం సృష్టించాడు. Henan Kuangshan Crane Co., Ltd అనే సంస్థ చైర్మన్ Cui Peijun ఈ అరుదైన గిఫ్ట్ ఇచ్చారు. ఫిబ్రవరి 13న నిర్వహించిన గ్రాండ్ ఈవెంట్‌లో కంపెనీ మొత్తం 180 మిలియన్ యువాన్ (సుమారు రూ.240 కోట్లు) బోనస్‌గా ప్రకటించింది. కంపెనీకి 270 మిలియన్ యువాన్ లాభం వచ్చిందని, అందులో దాదాపు 70 శాతం ఉద్యోగులకు పంచినట్టు South China Morning Post వెల్లడించింది. ఈ కార్యక్రమానికి దాదాపు 7 వేల మంది హాజరయ్యారు. 800 విందు టేబుళ్లు ఏర్పాటు చేసి, వాటి మీద క్యాష్ కట్టలు వరుసగా పెట్టారు.

వివరాలు 

మరో 20,000 యువాన్ అదనంగా ఇవ్వండి

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోల్లో టేబుళ్లపై నోట్లు కుప్పలుగా కనిపిస్తున్నాయి. కొంతమందిని స్టేజ్‌పైకి పిలిచి బహుమతులు ఇచ్చారు. మరికొందరికి మాత్రం ఓ ఇంటరాక్టివ్ గేమ్ పెట్టారు. టేబుల్‌పై ఉన్న డబ్బు ఎంత లెక్క పెడతారో అంత మొత్తం వాళ్లదే అని ప్రకటించారు. ఇదిలా ఉండగా కంపెనీ ఉద్యోగులకు వాషింగ్ మెషీన్లు కూడా గిఫ్ట్‌గా ఇచ్చింది. అయితే అప్పుడు కూడా బాస్ ఏ మాత్రం సంతృప్తి చెందలేదు. "బంగారం ధరలు పెరిగాయి? గతంలో నెక్లెస్‌లు,రింగులు ఇచ్చాం. ఇప్పుడు , అందరికీ ఇంకో 20,000 యువాన్ అదనంగా ఇవ్వండి" అంటూ ఫైనాన్స్ టీమ్‌ను ఆదేశించారు.

వివరాలు 

డబ్బులు ఎక్కువగా పంచే బాస్

2002లో స్థాపించబడిన ఈ కంపెనీ ప్రస్తుతం 130కి పైగా దేశాల్లో సేవలు అందిస్తోంది. కంపెనీలో దాదాపు 98.88 శాతం షేర్లు క్యూయ్ పెయిజున్ చేతిలోనే ఉన్నాయి. గత ఏడాది మహిళా దినోత్సవం సందర్భంగా 2 వేల మహిళా ఉద్యోగులకు సుమారు 1.6 మిలియన్ యువాన్ పంచి అప్పుడే వార్తల్లో నిలిచారు. యువత కారు లోన్లు, ఇల్లు లోన్లతో ఇబ్బందులు పడుతున్నారని, వారికి సహాయం చేయడం తమ బాధ్యత అని క్యూయ్ తెలిపారు. దీంతో నెటిజన్లు ఆయనను "డబ్బులు ఎక్కువగా పంచే బాస్" అంటూ ప్రశంసిస్తున్నారు.

Advertisement