Page Loader
'క్రిస్మస్ క్రాక్' వైరల్ అవుతున్న సరికొత్త వంటకం
నట్స్ టాపింగ్స్ తో రుచికరమైన 'క్రిస్మస్ క్రాక్ '

'క్రిస్మస్ క్రాక్' వైరల్ అవుతున్న సరికొత్త వంటకం

వ్రాసిన వారు Nishkala Sathivada
Dec 21, 2022
11:12 am

ఈ వార్తాకథనం ఏంటి

పండగ సందర్భంగా కొత్తగా వెరైటీగా ఏదైనా చేయాలనుకుంటే ఈ క్రిస్మస్ క్రాక్ ను ప్రయతించచ్చు. #ChristmasCracks అనే వంటకం మేరీ సోమర్ అనే ఫుడ్ క్రియేటర్ చేశారు. ఇప్పుడు ఇది వైరల్ గా మారింది. ఇప్పటికే ఈ వీడియోను 60 మిలియన్ల మందికి పైగా వీక్షించారు. క్రిస్మస్ క్రాక్ రెసిపీ 1 ప్యాక్ సాల్టిన్ క్రాకర్స్ 1 కప్పు ఉప్పు లేని వెన్న 1 కప్పు ప్యాక్ చేసిన బ్రౌన్ షుగర్ 12 ఔన్స్ ప్యాక్ చేసిన చాక్లెట్ చిప్స్ అదనపు టాపింగ్స్: నట్స్ తయారుచేసే విధానం: ఓవెన్‌ను 200 డిగ్రీల సెల్సియస్‌కు ప్రీహీట్ చేయాలి. పార్చ్‌మెంట్ పేపర్‌ మీద సాల్టిన్ క్రాకర్‌లను ఒకే పొరలా పెట్టాలి.

క్రిస్మస్

పంచదార పాకం, కరిగించిన చాక్లెట్ చిప్స్‌తో ఈ రెసిపీ చేయడం సులభం

మీడియం మంట మీద సాస్పాన్ లో వెన్న, బ్రౌన్ షుగర్ కలిపి కరిగించాలి. 5 నిమిషాలు అలా చక్కెర కరిగిపోయే వరకు కదిలించి ఉడకబెట్టాలి. స్టవ్ నుండి పంచదార పాకం తీసి క్రాకర్స్ మీద పోయాలి. అన్నిటి మీద పాకం పడేలా వేయాలి. 5 నుండి 6 నిమిషాలు వరకు బేక్ చేసిన తర్వాత, చాక్లెట్ చిప్స్ దాని మీద చల్లాలి. చాక్లెట్ చిప్స్ మెరుస్తూ కరిగిపోయే వరకు ఓవెన్‌లో 2 నిమిషాలు ఉంచాలి. ఓవెన్ నుండి తీసేసి, కరిగించిన చాక్లెట్‌ను ఐసింగ్ గరిటెతో పరచాలి. ఆపైన టాపింగ్స్ వేయాలి. ఇప్పుడు పాన్ గట్టిగా మారే వరకు ఫ్రిజ్ లో 20-30 నిమిషాలు ఉంచాలి. పెద్ద ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేయాలి.