పెరుగుతున్న ధరల వల్ల శాలరీ సరిపోక ఒత్తిడి పెరుగుతోందా? ఈ టిప్స్ పాటించండి
ఈ వార్తాకథనం ఏంటి
పెరుగుతున్న నిత్యావసర ధరలు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నాయి. ఆర్థికంగా బలంగా ఉన్న దేశమైన యుకే కూడా ధరల పెరుగుదలను తట్టుకోలేకపోతుంది. ఇక పాకిస్తాన్ లాంటి దేశాల్లో పరిస్థితి అల్లకల్లోలంగా ఉంది.
ఇండియాలోనూ ధరల పెరుగుదల ఎక్కువగానే ఉంది. ఇక్కడ విశేషం ఏంటంటే, ధరలు పెరుగుతున్నాయి కానీ జీతాలు పెరగట్లేదు. దానివల్ల అందరిలోనూ ఒత్తిడి పెరుగుతోంది.
ఆ ఒత్తిడి నుండి బయటపడాలంటే కొన్ని టిప్స్ పాటించాలి. అవేంటో చూద్దాం.
ఖర్చులను లెక్కకట్టండి: ఒక నెలలో మీకు నిజంగా ఎంత ఖర్చవుతుందనేది నోట్ చేసుకోండి. దానివల్ల మీరు దేనిమీదైనా అనవసరంగా ఖర్చుపెడుతున్నారేమో అర్థం అవుతుంది. అలాగే నిజంగా దేనిమీద ఖర్చు పెట్టాలనేది తెలుస్తుంది. కాబట్టి టెన్షన్ ఉండదు.
జీవనశైలి
పెరుగుతున్న ధరల వల్ల కలిగే ఒత్తిడిని దూరం చేసుకోవడానికి చేయాల్సిన పనులు
సోషల్ మీడియాకు దూరం: ఆర్థిక మాంద్యం గురించి సోషల్ మీడియాలో వచ్చే వార్తలు వింటూ కూర్చుంటే టెన్షన్ పెరిగిపోతుంటుంది. అదీగాక ఎక్కడో ఏదో జరిగినంత మాత్రాన మీరున్న దగ్గర కూడా అలానే జరగాలన్న గ్యారంటీ లేదని తెలుసుకోండి.
బిజీగా ఉండండి: ఖాళీ మెదడు చెత్త కుప్పలాంటిదని అంటుంటారు. ఏ పనీ లేకుండా కూర్చుంటే అన్నీ అనవసరమైన ఆలోచనలతో బుర్ర వేడెక్కిపోతుంది. మీకు పనికొచ్చే పనుల్లో బిజీ అవ్వండి. మానసిక ఆరోగ్యం కోసం ఏదైనా మంచి హాబీ అలవాటు చేసుకోండి
ఫ్రెండ్స్, ఫ్యామిలీతో గడపండి: మీ స్నేహితులను కలుసుకుని ఏవైనా పనులను ఇద్దరూ కలిసి చేసుకోండి. దానివల్ల మీకు ఖర్చు తగ్గుతుంది. ఫ్రెండ్ తో బంధం ఇంకా బలపడుతుంది.