Loading...
Foods : వేసవిలో చల్లదనం కోసం స్పెషల్ ఉల్లి పెరుగు పచ్చడి.. సులభంగా చేసుకోండిలా
వేసవిలో చల్లదనం కోసం స్పెషల్ ఉల్లి పెరుగు పచ్చడి.. సులభంగా చేసుకోండిలా

Foods : వేసవిలో చల్లదనం కోసం స్పెషల్ ఉల్లి పెరుగు పచ్చడి.. సులభంగా చేసుకోండిలా

వ్రాసిన వారు Moogati Shabari
Apr 08, 2026
03:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

పాతకాలంలో మన అమ్మమ్మలు, తాతయ్యలు భోజన సమయంలో పెరుగుతో పాటు పచ్చి ఉల్లిపాయ ముక్కలు లేదా పచ్చిమిర్చి తింటూ ఉండేవారు. ఆ రుచి ఇప్పటికీ చాలామందికి ఎంతో ఇష్టం. ముఖ్యంగా ఈ మండే వేసవిలో, చల్లదనాన్ని ఇచ్చే పెరుగు పచ్చడి భోజనానికి అద్భుతమైన జతగా ఉంటుంది. భారీగా ఉండే మాంసాహారం, వేయించిన వంటలు లేదా పాత ఊరగాయల బదులుగా, తేలికగా, వెంటనే తయారు చేసుకునే ఈ పెరుగు పచ్చడి కడుపుకు చల్లదనం ఇస్తుంది. పెరుగులో కొద్దిగా మరిగించి చల్లార్చిన పాలు కలిపితే రుచి మరింత మెరుగవుతుంది. మీరు కూడా ఈ విధంగా ఒకసారి చేసి చూస్తే, ఖచ్చితంగా నచ్చుతుంది.

వివరాలు

అవసరమైన పదార్థాలివే: 

పెరుగు - పావు కిలో

పాలు - 150 మిల్లీలీటర్లు

ఉల్లిపాయలు - 2

నూనె - 1 టేబుల్ స్పూన్

మెంతులు - పావు స్పూన్

పచ్చి శనగపప్పు - అర స్పూన్

మినపప్పు - అర స్పూన్

ఆవాలు - అర స్పూన్

జీలకర్ర - అర స్పూన్

అల్లం - 1 ఇంచు ముక్క

పచ్చిమిర్చి - 2

ఎండు మిర్చి - 2

కరివేపాకు - ఒక రెమ్మ

ఉప్పు - అవసరానికి సరిపడా

కారం - 1 స్పూన్

ఇంగువ - అర స్పూన్

కొత్తిమీర - కొద్దిగా

వివరాలు

తయారీ విధానం ఇదే

మొదటగా ఒక గిన్నెలో పెరుగు తీసుకుని, ముందుగా మరిగించి చల్లార్చిన అర టీ గ్లాసు పాలు అందులో పోసి, విస్కర్‌తో బాగా కలపాలి. మిశ్రమం ముద్దలు లేకుండా సున్నితంగా అయ్యేలా చూసుకోవాలి.

తర్వాత ఉల్లిపాయలను పొడవుగా, సన్నగా తరగి పక్కన పెట్టాలి.

ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి, అందులో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి అయ్యాక మెంతులు వేసాలి. అవి స్వల్పంగా వేగిన తర్వాత పచ్చి శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి.

తర్వాత అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, ఎండు మిర్చి వేసి కొద్దిసేపు కలపాలి. అనంతరం కరివేపాకు, తరగిన ఉల్లిపాయలు వేసి అవి మెత్తబడే వరకు వేపాలి.

ADVERTISEMENT

వివరాలు

అద్భుతమైన రుచిని ఆస్వాదించండిలా..

ఉల్లిపాయలు నాజూగ్గా అయ్యాక ఉప్పు, కొద్దిగా కారం, ఇంగువ వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి.

ఇప్పుడు ఈ వేపిన మిశ్రమంలో ముందుగా సిద్ధం చేసిన పెరుగు మిశ్రమాన్ని వేసి బాగా కలపాలి.

పెరుగు గట్టిగా అనిపిస్తే, కొద్దిగా పాలు లేదా నీరు లేదా మజ్జిగ కలిపి సరిపడా దారద్రవంగా చేసుకోవచ్చు.

చివరగా ఉప్పు రుచి చూసి, కొత్తిమీర తరుగు వేసి సర్వ్ చేయాలి.

ఇంతే రుచికరమైన, చల్లదనం ఇచ్చే ఉల్లి పెరుగు పచ్చడి సిద్ధంగా ఉంటుంది.

ADVERTISEMENT