Page Loader
మీ కలలో కనిపించిందే నిజ జీవితంలో జరిగిందా? అది డేజా రీవ్ కావచ్చు
డే జావు గురించి మీరు వినే ఉంటారు, డేజా రీవ్ గురించి తెలుసా?

మీ కలలో కనిపించిందే నిజ జీవితంలో జరిగిందా? అది డేజా రీవ్ కావచ్చు

వ్రాసిన వారు Sriram Pranateja
Mar 15, 2023
02:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

కలలో కనిపించినవి నిజంగా జరుగుతాయా అని మీరు ఆలోచించే ముందు, మీకెప్పుడైనా కలలో కనిపించిన సీన్, నిజంగా జరిగినట్లు అనిపించిందేమో గుర్తు చేసుకోండి. మీరు చేయబోయే పని గురించి ఆల్రెడీ మీకు కలలో కనిపించడమే డేజా రీవ్. ఇది డే జావు లాగా ఉందని అనుకుంటున్నారా? కానీ కాదు. డే జావు గురించి దాదాపుగా అందరికీ తెలుసు. ఏదైనా ఒక సంఘటన, ఏదైనా వస్తువు, ఎవరైనా మనుషులను గతంలో చూసినట్టుగా అనిపించడమే డే జావు. ఉదాహరణకు మీరొక ప్రదేశానికి వెళ్లారనుకుందాం. ఆ ప్రదేశాన్ని మీరు ఇంతకుముందే చూసినట్టుగా, ఆ ప్రదేశంలో తిరిగినట్టుగా అనిపించడమే డే జావు. ఇది దాదాపుగా చాలామందికి జరుగుతూ ఉంటుంది.

మానసిక ఆరోగ్యం

కలలో కనిపించినది ఇలలో కనిపించడమే డేజా రీవ్

డేజా రీవ్ అనేది అందరిలో జరిగే అవకాశం తక్కువ. ఒక ప్రదేశానికి మీరు వెళ్ళినపుడు ఆ ప్రదేశానికి మీరు వెళ్ళినట్టు మీకు ఇంతకుముందు కల రావడమే డేజా రీవ్. ఈ డేజా రీవ్ మీద పరిశోధనలు చేస్తున్నారు. డేజా రీవ్ అనేది ఫ్రెంఛ్ పదం. ఆల్రెడీ కలగన్నాను అని దాని అర్థం. 2010లో జరిపిన ఒక పరిశోధన ప్రకారం, డేజా రీవ్ అనేది వయసు పెరుగుతున్న వృద్ధులలో ఎక్కువగా కనిపించే అవకాశం ఉందట. సాధారణంగా మనకొచ్చే కలలను మర్చిపోతాం. కానీ ఎప్పుడో ఒకసారి మనకు కనిపించిన ప్రదేశాలు, కలిసిన వ్యక్తుల కారణంగా ఆ కలలు మళ్ళీ గుర్తొస్తుంటాయి. దీనికి కారణం కలలకు సంబంధించిన స్టోరేజీ, మెదడులో సెపరేట్ గా ఉంటుందేమోనని పరిశోధకుల వాదన.