Dasara Navaratri 2023: ఉపవాస నియమాలు, పాటించాల్సిన పద్దతులు
దసరా నవరాత్రుల్లో దుర్గామాతను పూజిస్తారు. తొమ్మిది రోజులపాటు తొమ్మిది అవతారాల్లో దుర్గామాతను పూజిస్తారు. శక్తి స్వరూపిణి అయిన అమ్మవారు మన కష్టాలను తొలగిస్తుందని భక్తులు పూజలు చేస్తారు. నవరాత్రుల సమయంలో చాలామంది ఉపవాసం కూడా ఉంటారు. ఉపవాసం ఉండేవారు ఎలాంటి నియమాలు పాటించాలి, పూజా విధానంలో ఎలాంటి సంప్రదాయాలను అనుసరించాలనేది ఇక్కడ తెలుసుకుందాం. నవరాత్రి పూజా విధానము నవరాత్రులలో ఉపవాసం ఉండాలనుకునే వారు మొదటి రోజు నాడు దుర్గాదేవికి పూజ చేసి ఉపవాసం ఉంటానని ప్రార్థన చేయాలి. అప్పటినుండి ఉపవాసం మొదలైనట్టు లెక్క. ఉపవాసం ఉన్నవారు రోజూ తొందరగా నిద్ర లేవాలి. బ్రహ్మ ముహూర్తంలోనే మేల్కోవాలి.
ఉపవాసం ఉండేవారు పాటించాల్సిన నియమాలు
సూర్యుడు ఉదయించక ముందే నిద్ర నుండి మేల్కోవాలని తెలుసుకోవాలి. నిద్రలేచిన తర్వాత స్నానం చేసి మంత్రోచ్ఛారణతో దుర్గామాతను పూజించాలి. ఉపవాసం ఉండేవాళ్ళు ఉదయం పూట పూజ చేయాలి, అలాగే సాయంత్రం పూట కూడా పూజ చేయాలి. ఉదయం పూజ చేసిన తర్వాత సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి. సాయంత్రం పూట పూజ పూర్తయ్యాక పండ్లు వంటి తేలికైన ఆహారం అయ్యుండాలి. ఒకవేళ మీకు ఏమైనా అనారోగ్య సమస్యలు ఉన్నట్లయితే సాయంత్రం పూజ తర్వాత ఆహారాన్ని తీసుకోవచ్చు. నవరాత్రుల సమయంలో వెల్లుల్లి, ఉల్లిపాయ, మాంసం వంటి వాటిని తీసుకోకూడదు. అలాగే జుట్టు కత్తిరించుకోవడం, గోర్లు కత్తిరించుకోవడం మధ్యాహ్నం పూట నిద్రపోవడం చేయకూడదు. అంతేకాదు నవరాత్రుల సమయంలో నల్లని దుస్తులు లెదర్ వస్తువులను ధరించకూడదు.