
మీ ఇంట్లో పూజగదిని అందంగా అలకరించడానికి చేయాల్సిన పనులు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రతీ ఇంట్లో పూజగది సర్వసాధారణంగా ఉంటుంది. పొద్దున్న లేచి స్నానం చేసి దేవునికి ప్రార్థనలు చేసే అలవాటున్న వారు పూజగదిని అందంగా
దానికోసం ఏం చేయాలో చూద్దాం.
రంగులు:
పూజగది అందంగా కనిపించాలంటే ఆ గది గోడల రంగు అందంగా ఉండాలి. లేత పసుపు లేదా లేత నారింజ రంగును గోడలకు పెయింట్ వేస్తే బాగుంటుంది. పూజ గది తలుపునకు గంటలు, ఫిలిగ్రీ వర్స్ వంటివి ఉంటే మరింత అందంగా కనిపిస్తుంది.
లైట్స్:
పూజగదికి సరికొత్త తీసుకొచ్చేవి లైట్స్ మాత్రమే. బ్యాటరీతో నడిచే లైట్స్ తో పూజగదిని సరికొత్త కళను తీసుకురండి. ఎల్ఈడీ స్ట్రిప్స్ వాడితే బాగుంటుంది. గదిలో స్థలం ఎక్కువగా చిన్నపాటి షాండ్లియర్ పెట్టుకోవచ్చు.
అలంకరణ
పూజ గదిని అలంకరించే విధానాలు
మార్బుల్స్, తాజా పూలు:
దేవుడికి రోజూ తాజా పూలతో అలంకరించండి. ప్రార్థన చేసేటపుడు తాజా పూలు కనిపిస్తే మనసుకు ఆహ్లాదంగా ఉంటుంది. పూజగదిలో నేలమీద మార్బుల్స్ ఉంటే బాగుంటుంది.
పూజగది తలుపులకు రెండు వైపులా రెండు పూలకుండీలు పెడితే అద్భుతంగా ఉంటుంది.
ఫ్యాబ్రిక్ చాపలు:
దేవుడి గదిలో నేలమీదనే కూర్చుంటారు. అలాంటప్పుడు ప్లాస్టిక్ చాపలు కాకుండా ఫ్యాబ్రిక్ తయారైన చిన్నపాటి చాపలు ఉంటే బెటర్. దీనివల్ల ఒకరకమైన సహజత్వం వస్తుంది. ప్లాస్టిక్ చాపల వల్ల కృత్రిమత్వం వస్తుంది.
అరుదైన దేవుడి విగ్రహాలు:
అరుదైన లోహాలతో తయారయ్యే దేవుడి విగ్రహాలను పూజగదిలో ఉంచితే, పూర్తి గదికే సరికొత్త కళ వచ్చి చేరుతుంది. టెర్రాకొట్ట్టా విగ్రహాలు, కంచు దీపాలు మొదలగు వాటిని తీసుకురండి.