ఆరోగ్యాన్ని అందించే బ్రౌన్ రైస్ తో రుచికరమైన వంటలు
ఈ వార్తాకథనం ఏంటి
ఆరోగ్యంతో పాటు రుచిని కూడా అందించే రెసిపీ గురించి తెలుసుకుందాం
బ్రౌన్ రైస్ కిచిడి
కావలసినవి:1/2 కప్పు బ్రౌన్ రైస్, 1-కప్పు పెసరపప్పు, 1-టేబుల్ స్పూన్ తరిగిన ఉల్లిపాయలు, 2 టేబుల్ స్పూన్లు నెయ్యి, 1 టీస్పూన్ జీలకర్ర గింజలు, 1-టేబుల్ స్పూన్ అల్లం మిరపకాయ పేస్ట్, ఒక చిటికెడు ఇంగువ, ½ చెంచా పసుపు పొడి, 3-లవంగాలు, సన్నగా తరిగిన కొత్తిమీర
ఆహారం
నీటిలో నానబెట్టిన తర్వాత పెసరపప్పు, బ్రౌన్ రైస్ కలపాలి
చేయాల్సిన విధానము:
30 నిమిషాలు నీటిలో నానబెట్టిన తర్వాత పెసరపప్పు, బ్రౌన్ రైస్ కలపాలి. ప్రెషర్ కుక్కర్ లో నెయ్యి వేసి జీలకర్ర వేయాలి. జీలకర్ర చిమ్మిన తర్వాత ఇంగువ, అల్లం మిరపకాయ పేస్ట్ వేయాలి. కొద్దిసేపు వేయించాక ఉల్లిపాయ వేయాలి. ఒక నిమిషం పాటు,మిగిలిన మసాలా దినుసులు కలపాలి . బ్రౌన్ రైస్-పెసరపప్పు కూడా కలిపి, నీరు,ఉప్పు వేసి, ఆపై. ప్రెషర్ కుక్కర్ మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చే వరకు ఉండి కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసి వేడిగా సర్వ్ చేయాలి.