Page Loader
IRCTC: ఐఆర్సీటీసీ స్పెషల్ సర్వీస్.. లైఫ్ లో ఒక్కసారైనా ఎక్కాల్సిందే.. 
ఐఆర్సీటీసీ స్పెషల్ సర్వీస్.. లైఫ్ లో ఒక్కసారైనా ఎక్కాల్సిందే..

IRCTC: ఐఆర్సీటీసీ స్పెషల్ సర్వీస్.. లైఫ్ లో ఒక్కసారైనా ఎక్కాల్సిందే.. 

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 06, 2025
12:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

రైలు ప్రయాణికులకు రాజకీయ లగ్జరీ అనుభూతిని అందించేందుకు ఐఆర్సీటీసీ కొత్త ప్రత్యేక సర్వీసును ప్రారంభిస్తోంది. ఈ ప్రత్యేక రైలుకు 'గోల్డెన్ చారియట్' అనే పేరు పెట్టారు. దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధ సాంస్కృతిక ప్రదేశాలను వీక్షించేందుకు ఇది అద్భుతమైన అవకాశం. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ, విశేషమైన మార్గాల్లో సౌకర్యవంతమైన రైలు ప్రయాణాన్ని కోరుకునే వారికి ఇది అసలైన గోల్డెన్ ఛాన్స్. ఇందులో లభించే సౌకర్యాలు, ప్రత్యేకతలు మీ హృదయాన్ని ఉల్లాసపరిచే విధంగా ఉంటాయి. నయా వింటేజ్ రాయల్ లుక్‌తో ఇంటీరియర్‌ను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఈ విభిన్న అనుభూతిని పొందాలనుకుంటే పూర్తి వివరాలు తెలుసుకోండి!

వివరాలు 

కేవలం మార్చి వరకు మాత్రమే! 

స్పా, జిమ్, ప్రత్యేక వైన్ కార్నర్ వంటి అద్భుతమైన సౌకర్యాలతో, గోల్డెన్ చారియట్ మీ ప్రయాణాన్ని రాజకీయమైన లగ్జరీ అనుభవంగా మార్చనుంది. భారతీయ రైల్వే, ఐఆర్సీటీసీ సంయుక్తంగా ఈ సర్వీసును ప్రారంభించాయి. దీని సేవలు డిసెంబర్ 14, 2024న ప్రారంభమయ్యాయి. ఎంపిక చేసిన తేదీల్లో మార్చి వరకు అందుబాటులో ఉంటాయి. గోల్డెన్ చారియట్ రైలు ప్రత్యేకతలు ఈలగ్జరీ రైలులో మొత్తం 80 మంది ప్రయాణికులు కూర్చునే వెసులుబాటు ఉంది.అందులో 13డబుల్ బెడ్ క్యాబిన్లు, 26ట్విన్ బెడ్ క్యాబిన్లు ఉంటాయి. దివ్యాంగుల కోసం ప్రత్యేక క్యాబిన్ కూడా ఉంది.ప్రతి క్యాబిన్‌లో వైఫై కనెక్టివిటీ,ఎయిర్ కండిషనింగ్, ఓటీటీ యాక్సెస్‌తో కూడిన స్మార్ట్ టీవీలు,ఆధునిక బాత్రూమ్‌లు, అధిక నాణ్యత కలిగిన ఫర్నిచర్ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి.

వివరాలు 

ట్రైన్‌లోనే అన్ని లగ్జరీ సేవలు 

'రుచి' & 'నలపాక్' రెస్టారెంట్లు,వివిధ అంతర్జాతీయ,భారతీయ వంటకాలతో ప్రయాణికులను అలరిస్తాయి. హెల్త్ వెల్నెస్ & స్పా: ప్రయాణంలోనే విశ్రాంతి అనుభవాన్ని అందించేందుకు ప్రత్యేక స్పా ఏర్పాటు చేశారు. ప్రత్యేక బార్: ప్రీమియం వైన్లు,స్పిరిట్స్‌తో కూడిన ప్రత్యేక కార్నర్‌ను అందుబాటులో ఉంచారు. ఆధునిక జిమ్: ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని,తాజాదనాన్ని కలిగించే జిమ్ ఏర్పాటైంది. 24 గంటల భద్రతా ఏర్పాట్లు రైలు మొత్తం CCTV నిఘా కింద ఉంటుంది. అధునాతన ఫైర్ అలారమ్ వ్యవస్థలు అమర్చారు. 24/7 భద్రతా సిబ్బంది ప్రయాణికుల రక్షణను నిర్ధారిస్తారు. ప్రయాణ మార్గాలు 'ప్రైడ్ ఆఫ్ కర్ణాటక' (5 రాత్రులు, 6 పగళ్లు): బెంగళూరు → బందీపూర్ → మైసూర్ → హళేబీడు → చిక్కమగళూరు → హంపి → గోవా.

వివరాలు 

'జ్యువెల్స్ ఆఫ్ సౌత్' ప్రయాణం: 

బెంగళూరు → మైసూర్ → హంపి → మహాబలిపురం → తంజావూరు → చెట్టినాడ్ → కొచ్చిన్. 'కర్ణాటక గ్లింప్సెస్' (3 రాత్రులు, 4 పగళ్లు): బెంగళూరు → బందీపూర్ → మైసూర్ → హంపి. గోల్డెన్ చారియట్ రైలు టికెట్ ధర డీలక్స్ క్యాబిన్‌లో 'గ్లింప్సెస్ ఆఫ్ కర్ణాటక' ప్రయాణానికి మొత్తం ప్యాకేజీ రూ. 4,00,530 + 5% జీఎస్టీతో ప్రారంభమవుతుంది. ఈ ప్యాకేజీకి లగ్జరీ వసతి, అన్ని భోజనాలు, ప్రీమియం పానీయాలు, గైడెడ్ టూర్లు, స్మారక ప్రదేశాల ప్రవేశ రుసుములు అన్నీ కలిపి ఉంటాయి.