మహాభారతంలో పేర్కొన్న వంటకాలు ఇప్పటికీ ఇంట్లో తయారు చేస్తారని మీకు తెలుసా?
మహాభారతంలో పేర్కొన్న కొన్ని వంటకాలు ఇప్పటికీ కూడా ప్రాచుర్యంలో ఉన్నాయన్న సంగతి చాలామందికి తెలియదు. అప్పటి కాలం నాటి వంటకాలు ఇప్పటికీ ఇంట్లో చేసుకుంటామనేది చాలామందిని ఆశ్చర్యపరిచే విషయం. ప్రస్తుతం ఈ విషయాల గురించి మాట్లాడుకుందాం. పానీ పూరి: ఇండియాలో పానీ పూరి చాలా ఫేమస్. సాయంకాలం అయితే చాలామంది పానీ పూరి తినడానికి ఆసక్తి చూపిస్తారు. భారతదేశంలోని ప్రధాన నగరాల్లో చాలా చోట్ల ఇది లభిస్తుంది. నిజానికి ఈ ఫుడ్ వెరైటీని మొదటగా మహాభారతం కాలంలో పాండవుల భార్య ద్రౌపది తయారు చేశారని చెబుతారు. మిగిలిపోయిన బంగాళదుంప కూర, గోధుమ పిండితో ఏదైనా చేయమని తన అత్తగారు అడిగినప్పుడు పానీ పూరి తయారు చేసిందని అంటారు.
మహాభారతంలో పేర్కొన్న పెరుగుతో చేసే వంటకం
పాయసం: సాధారణంగా ఏదైనా శుభవార్త తెలిసినప్పుడు నోరు తీపి చేయడం భారతీయులకు అలవాటు. మహాభారత సమయంలో పాండవులలో పెద్దవాడైన ధర్మరాజు, రోజూ ఉదయాన్నే పాయసం తాగేవాడట. దీనికి సంబంధించిన విషయాలు ఉద్యోగపర్వంలో తెలుస్తున్నాయి. క్రిసర: బియ్యం, చక్కెర, పాలు, నువ్వులు, యాలకులు, దాల్చిన చెక్క, కుంకుమ పువ్వుతో తయారయ్యే ఈ వంటకం పాయసం లాగానే ఉంటుంది. కాకపోతే పాయసం కన్నా చిక్కగా కనిపిస్తుంది. క్రిసర గురించి మహాభారతంలో శాంతి పర్వంలో పేర్కొన్నారు. అవియల్: పెరుగు, కొబ్బరి పాలతో తయారు చేసే కేరళ చెందిన ఈ వంటకాన్ని మొదటగా భీముడు తయారు చేశాడని చెబుతారు. దూర్వాస ముని కోసం ఈ వంటకాన్ని భీముడు తయారు చేశారని అంటారు.