Diwali 2024: దీపావళి ఎప్పుడు జరుపుకోవాలి..అక్టోబర్ 31,నవంబర్ 1నా?
చీకట్లను పారదోలుతూ వెలుగులు నింపే పండుగ.. దీపావళి. విజయం సంకేతంగా జరుపుకునే ఈ పండుగ రోజున ప్రతి ఇల్లు దీప కాంతులతో ప్రకాశిస్తుంది. ప్రతి ఇంటా లక్ష్మీ పూజ, బాణసంచా మోతతో కలర్ఫుల్గా మారుతుంది. అయితే, అలాంటి దీపావళి ఎప్పుడు? అక్టోబర్ 31నా? నవంబర్ 1నా? అనేది ప్రస్తుతం పెద్ద ప్రశ్నగా మారింది. దీపావళి రోజున లక్ష్మీదేవి భూమిని దర్శించుకోవడానికి వస్తుందని నమ్ముతారు. ఈ ఏడాది దీపావళి కచ్చితమైన తేదీ విషయంలో గందరగోళం నెలకొంది. నిజానికి, దీపావళి ఆశ్వయుజ అమావాస్య రోజున వస్తుంది. దానికి ముందు రోజు వచ్చే ఆశ్వయుజ బహుళ చతుర్దశిని నరక చతుర్దశిగా జరుపుకుంటారు. అయితే, ఆ తిథి ఎప్పుడు వచ్చిందనే దానిపై క్లారిటీ లేదు.
నవంబర్ 1న ఆయుష్మాన్ యోగం
ఈసారి ఎందుకు ఈ గందరగోళం ? శాస్త్రల ప్రకారం, నవంబర్ 1న దీపావళిని జరుపుకోవాలని పండితులు తెలుపుతున్నారు. ఆ రోజున దీపావళిని జరుపుకోవడం శుభప్రదమని అంటున్నారు. ప్రదోష అమావాస్య అక్టోబర్ 31న.. నవంబర్ 1న.. ఈ రెండు తేదీలలో వస్తుంది. యాధృచ్చికంగా నవంబర్ 1న ఆయుష్మాన్ యోగం.. స్వాతి నక్షత్రం కలయిక జరిగింది. అందుకే దీపావళి నవంబర్ 1న జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. ఇక వేద పంచాంగం ఏం చెబుతుందో చూద్దాం.. దీపావళి నాడు లక్ష్మీ పూజ అమావాస్య తిథి, ప్రదోష కాలాల్లో.. సూర్యాస్తమయం నుంచి అర్థరాత్రి వరకు జరుగుతుంది. ఈ లెక్కన అమావాస్య తిథి, ప్రదోషకాలం, శుభ సమయాలున్న అక్టోబర్ 31న దీపావళిని జరుపుకోవడం మంచిదని పండితులు అంటున్నారు.
ఆశ్వయుజ మాసంలోని అమావాస్య తిథిలో దీపావళి
హిందువులు జరుపుకునే ప్రధాన పండుగల్లో దీపావళి ఒకటి. ఈ పండుగను ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసంలోని అమావాస్య తిథిలో వైభవంగా జరుపుకుంటారు. ఆ రోజున గణేశుడు, సరస్వతి దేవి, కుబేరుడితో పాటు లక్ష్మీదేవిని నియమ నిష్టలతో పూజిస్తారు. అయితే, ఈసారి దీపావళి కచ్చితమైన తేదీ విషయంలో కన్ఫ్యూజన్ నెలకొంది. ఫైనల్గా ఏ తేదీ ఫిక్స్ అవుతుందన్నది చూడాలి.