Page Loader
Dragon Fruit: డ్రాగ‌న్ ఫ్రూట్ తింటే ఇన్ని లాభాలు క‌లుగుతాయా..? 
డ్రాగ‌న్ ఫ్రూట్ తింటే ఇన్ని లాభాలు క‌లుగుతాయా..?

Dragon Fruit: డ్రాగ‌న్ ఫ్రూట్ తింటే ఇన్ని లాభాలు క‌లుగుతాయా..? 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 17, 2025
11:58 am

ఈ వార్తాకథనం ఏంటి

పింక్ రంగులో ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపించే డ్రాగన్ ఫ్రూట్ పండ్లు చాలా అందంగా ఉంటాయి. వీటినే పిటాయా అని కూడా పిలుస్తారు. ప్ర‌స్తుతం ఈ పండ్లు మ‌న దేశంలో విస్తృతంగా ల‌భిస్తున్నాయి. ముందుగా చైనాకు మాత్ర‌మే పరిమితం అయిన ఈ పండును ఇప్పుడు భారత్‌లో కూడా సాగు చేస్తున్నారు. అందువ‌ల్ల మనకు డ్రాగన్ ఫ్రూట్‌ల‌భ్యం పెరిగింది. సీజన్‌ ప్రకారం, రహదారుల పక్కన ఈ పండ్లు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇవి పైభాగంలో పింక్ రంగులో, లోపల తెలుపు రంగులో ఉంటాయి. రుచి కాస్త చ‌ప్ప‌గా , వ‌గ‌రుగా ఉంటుంది. అయితే, ఈ పండ్లను తిన‌డం వ‌ల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ల‌భిస్తాయి.

వివరాలు 

ప్రాణాంతక వ్యాధుల నుండి రక్షణ

డ్రాగన్ ఫ్రూట్‌లో అనేక ముఖ్యమైన విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ ఉంటాయి. ఇవి మ‌న శ‌రీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. వ్యాధుల నుండి రక్షిస్తాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు, బీటా స‌య‌నిన్స్, ఫ్లేవ‌నాయిడ్స్, విట‌మిన్ సి, ఫ్రీ ర్యాడిక‌ల్స్‌ను నియంత్రించి వాపులను తగ్గిస్తాయి. వీటి ద్వారా క్యాన్సర్‌, గుండె జబ్బులు వంటి ప్రాణాంతక వ్యాధుల నుండి రక్షణ పొందవచ్చు.

వివరాలు 

అధిక బ‌రువు, షుగ‌ర్‌కు చెక్‌.. 

డ్రాగన్ ఫ్రూట్‌లో క్యాలరీలు తక్కువగా ఉంటాయి మరియు ఫైబర్ అధికంగా ఉంటుంది. అందువ‌ల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది, ఆకలి నియంత్రణలో ఉంటుంది, తద్వారా తినే పరిమాణం తగ్గుతుంది. ఈ పండ్లను రోజూ తినడం ద్వారా బరువు తగ్గుతుంది. అదేవిధంగా, డ్రాగన్ ఫ్రూట్‌ ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది, ఇది టైప్ 2 డ‌యాబెటిస్‌ ఉన్నవారికి షుగర్‌ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.

వివరాలు 

గుండె ఆరోగ్యానికి..

డ్రాగన్ ఫ్రూట్‌ లో ఒమెగా 3, ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి, ఇవి కొలెస్ట్రాల్‌ ను నియంత్రించి గుండె ఆరోగ్యాన్ని మెరుగు చేస్తాయి. అలాగే, ఇందులోని ఫైబర్‌ జీర్ణవ్యవస్థను పటిష్టంగా ఉంచుతుంది, మలబద్దకం, గ్యాస్, అజీర్తి వంటి సమస్యలను తగ్గిస్తుంది. ఈ విధంగా, డ్రాగన్ ఫ్రూట్‌ అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది, కాబట్టి దీన్ని రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం మంచిది.