Page Loader
World Television Day 2023: భారతదేశంలోకి టీవీ ఎప్పుడు వచ్చిందో తెలుసా.. మొదటగా ఆ ప్రాంతంలోకి!
భారతదేశంలోకి టీవీ ఎప్పుడు వచ్చిందో తెలుసా.. మొదటగా ఆ ప్రాంతంలోకి!

World Television Day 2023: భారతదేశంలోకి టీవీ ఎప్పుడు వచ్చిందో తెలుసా.. మొదటగా ఆ ప్రాంతంలోకి!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 21, 2023
04:25 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీవీ ఓ ప్రసార మాధ్యమంగా వచ్చి ఇప్పుడు ప్రతి ఇంట్లో ఓ భాగం అయిపోయింది. నేడు ప్రపంచ టెలివిజన్ దినోత్సవం సందర్భంగా కొన్ని విషయాలను తెలుసుకుందాం. నవంబర్ 21న ప్రతేడాది టెలివిజన్ దినోత్సవం(World Television Day) జరుపుకుంటాం. ఇప్పుడంటే ప్రతి ఇంట్లోనూ టీవీలు ఉన్నాయి. ఒక 30 ఏళ్ల క్రితం ఒక ఉళ్లో ఒక్క టీవీ ఉండడం పెద్ద విశేషం. ఒకప్పుడు టీవీ అంటే డబ్బు ఉన్నవారి ఇళ్లలోనే ఉండేది. కానీ మారుతున్న పరిస్థితుల కారణంగా ప్రతి ఇంట్లో టీవీ భాగమైపోయింది. టెక్నాలజీ పెరిగి సెల్ ఫోన్ల వాడకం పెరిగినా టీవీలను చూసేవారు ఉన్నారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (UNGA) ప్రతి సంవత్సరం నవంబర్ 21ని ప్రపంచ టెలివిజన్ దినోత్సవంగా నిర్వహించాలని నిర్ణయించింది.

Details

1924లో టీవీని కనిపెట్టిన జాన్ లోగి బైర్డ్

టీవీని 1924లో స్కాటిష్ ఇంజనీర్, జాన్ లోగీ బైర్డ్ కనిపెట్టారు. ఇది యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ సాయంతో ఇండియాలో సెప్టెంబర్ 15, 1959న దిల్లీలో ప్రవేశపెట్టారు. ఇక ప్రపంచ టెలివిజన్ దినోత్సవం రోజున కమ్యూనికేషన్, ప్రపంచీకరణలో టెలివిజన్ పోషిస్తున్న పాత్ర గురించి, ప్రసార మాధ్యమాల పాత్రను గుర్తు చేశారు. సోషల్ మీడియాలో కంటెంట్‌లో వాస్తవికత సందేహాస్పందంగా ఉన్న సమయాల్లో సమాచారాన్ని అందించడానికి ప్రభుత్వాలు, వార్తా సంస్థలపై ఆ రోజున చర్చిస్తారు. మరోవైపు ప్రపంచ రాజకీయాల్లోనూ టీవీ పాత్ర చాలా గొప్పదని చెప్పొచ్చు.