Winter 2025: చలికాలంలో పెదవులు తరచూ పగిలిపోతున్నాయా? దీని వెనుక ఉన్న అసలు కారణం ఇదే!
ఈ వార్తాకథనం ఏంటి
చలికాలం వచ్చిందంటే చర్మం పొడిబారడం, పెదవులు పగిలిపోవడం లాంటి సమస్యలు తలెత్తడం సహజం. చాలా మంది దీని వల్ల ఇబ్బందిపడతారు. అయితే ఈ సమస్య కేవలం చలికాల వాతావరణం వల్లనే కాకుండా, శరీరంలో కొన్ని ముఖ్యమైన పోషకాలు లేకపోవడం వల్ల కూడా వస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. మన ఆరోగ్యంలో ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్ ఎంత అవసరమో, విటమిన్లు కూడా అంతే కీలకం. వీటి లోపం వస్తే శరీరంలో అనేక రకాల సమస్యలు ఏర్పడతాయి.
Details
పెదవులు పగిలిపోవడానికి అసలు కారణం ఏమిటి?
చలికాలంలో పెదవులు తరచుగా పగిలిపోవడం లేదా పొడిబారడం వెనుక ఒక ప్రధాన కారణం విటమిన్ 'బీ12 లోపం'. ఈ విటమిన్ శరీరంలో తక్కువగా ఉన్నప్పుడు పెదవులు పొడిబారడమే కాకుండా చర్మం కూడా రఫ్‌గా మారుతుంది. విటమిన్ బీ12 ఎర్ర రక్తకణాల తయారీలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ విటమిన్ కొరత రక్తహీనతకు దారి తీస్తుంది. అంతేకాదు, జ్ఞాపకశక్తి తగ్గడం, తిమ్మిరి, జలదరింపు, అలసట వంటి సమస్యలు కూడా ఈ లోపం వల్ల తలెత్తుతాయి. ఇది శరీరంలోని DNA సంశ్లేషణలో కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
Details
విటమిన్ బీ12 లోపం నివారించడానికి ఏమి తినాలి?
విటమిన్ బీ12 లోపాన్ని తగ్గించడానికి ఆహారంలో ఈ పదార్థాలను చేర్చుకోవడం చాలా ప్రయోజనకరం. చేపలు: సాల్మన్, ట్యూనా, సార్డిన్ వంటి చేపలు విటమిన్ బీ12 సమృద్ధిగా కలిగి ఉంటాయి. షెల్ఫిష్: క్లామ్స్, ఆయిస్టర్స్ లాంటి వాటిని కూడా ఆహారంలో చేర్చుకోవచ్చు. గుడ్లు: గుడ్లు విటమిన్ బీ12కి మంచి మూలం. పాల ఉత్పత్తులు: పాలు, పెరుగు, నీరు వంటి పాల ఆధారిత పదార్థాలు శరీరంలో విటమిన్ బీ12 స్థాయిని పెంచుతాయి. వీటిని రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా శరీరంలో విటమిన్ బీ12 లోపాన్ని తగ్గించుకోవచ్చు. దీంతో చలికాలంలో పెదవులు పగిలిపోవడం, చర్మం పొడిబారడం వంటి సమస్యలు దూరమవుతాయి.