LOADING...
Skin Care Tips: చలికాలంలో చర్మం క్రాక్ అవుతుందా? నిపుణుల చెప్పిన సింపుల్ రూల్స్ ఇవే!
చలికాలంలో చర్మం క్రాక్ అవుతుందా? నిపుణుల చెప్పిన సింపుల్ రూల్స్ ఇవే!

Skin Care Tips: చలికాలంలో చర్మం క్రాక్ అవుతుందా? నిపుణుల చెప్పిన సింపుల్ రూల్స్ ఇవే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 24, 2025
01:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

చలికాలం మొదలైతే చాలామందికి చర్మం పొడిబారడం సహజమే. ఉష్ణోగ్రతలు తగ్గుతాయి కాబట్టి ఈ సీజన్‌లో డ్రై స్కిన్ సమస్య ఎక్కువగా కనిపిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ సమయంలో వేడి నీటితో స్నానం చేసేవారు 5-10 నిమిషాల్లోపే పూర్తి చేసుకోవాలని వారు సూచిస్తున్నారు. లోషన్‌లకు బదులుగా వాసనలేని క్రీమ్‌లు వాడడం మంచిదని కూడా నిపుణుల సలహా. చల్లని గాలులతో చర్మంలోని మాయిశ్చర్ తగ్గిపోవడంతో పొడిబారడం, పొలుసులు లేచే పరిస్థితి ఏర్పడుతుందని వైద్యులు అంటున్నారు. చేతులు, కాళ్లపై ఈ సమస్య మరింత తీవ్రంగా కనిపించి, కొన్ని సందర్భాల్లో పుండ్లు పడే అవకాశం కూడా ఉంటుంది. శీతాకాల ఒత్తిడితో ఇబ్బంది పడే చర్మానికి వెచ్చని ఆలివ్ ఆయిల్ రాసుకోవడం ఉపశమనం ఇస్తుందని సూచిస్తున్నారు.

Details

 5-10 నిమిషాల్లో స్మానం ముగించాలి

స్నానం కూడా ఎక్కువ సమయం తీసుకోకుండా 5-10 నిమిషాల్లో ముగించాల్సిందేనని నిపుణులు నొక్కి చెబుతున్నారు. చర్మం డ్రై కాకుండా ఉండాలంటే లోషన్‌లకంటే సువాసన లేని క్రీమ్‌లే బెస్ట్. స్నానం చేసి చర్మంతడిగా ఉన్నప్పుడే వెంటనే మాయిశ్చరైజర్ రాసుకోవాలి. అలాగే కఠినమైన సబ్బులు వాడడం పూర్తిగా మానేయాలి. వారానికి ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే ఎక్స్‌ఫోలియేషన్ చేయాలని సూచిస్తున్నారు. ఇంట్లో అయితే హ్యూమిడిఫైయర్ ఉపయోగించడం మంచిదని, బయటకు వెళ్తే తప్పనిసరిగా గ్లౌస్ ధరించాలని వైద్యులు చెబుతున్నారు. దుస్తులు ఉతకడానికి కూడా సువాసనలేని లాండ్రీ డిటర్జెంట్లు వాడాలని సలహా ఇస్తున్నారు. ఈ సమాచారం మొత్తం నమ్మకమైన ఇంటర్నెట్ వనరుల ఆధారంగా సేకరించినదే అయినా, మీచర్మ పరిస్థితికి సరిపడే పద్ధతులను అనుసరించేందుకు డెర్మటాలజిస్ట్ సలహా తీసుకోవడం తప్పనిసరి.