Hot water: వేడి నీరు తాగుతున్నారా? డీహైడ్రేషన్, జీర్ణ సమస్యలు తలెత్తే అవకాశం!
ఉదయాన్నే వేడినీరు తాగడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వేడి నీరు తాగితం వల్ల బరువు తగ్గే అవకాశం ఉంటుంది. అయితే కొన్ని సమస్యలు కూడా వచ్చే ప్రమాదముంది. ఉదయం ఖాళీ కడుపుతో వేడి నీరు తాగడం వల్ల వచ్చే నష్టాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. డీహైడ్రేషన్ ఎక్కువగా వేడి నీరు తీసుకోవడం వల్ల శరీరంలో డీహైడ్రేషన్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. కొన్ని పోషకాలు, ఖనిజాలను శరీరం అబ్జార్బ్ చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ముఖ్యంగా కొన్ని మందులు పనిచేయవు. కాబట్టి జాగ్రత్తగా ఉండటం మంచిది.
దంత సమస్యలు
వేడి నీరు తాగడం దంతాలకు నష్టం కలిగించవచ్చు. ఈ ప్రక్రియ వల్ల మీ టేస్ట్ బడ్స్ దెబ్బతింటాయి. తద్వారా మీరు తిన్న ఆహారంలోని రుచులను అనుభవించడం కష్టం అవుతుంది. జీర్ణ సమస్యలు ఖాళీ కడుపుతో వేడి నీటిని తాగడం జీర్ణ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఇది యాసిడ్ రిఫ్లక్స్, కడుపు నొప్పి వంటి సమస్యలను కలిగించవచ్చు. అందువల్ల పరగడపున వేడి నీరు తాగడం మానేయాలి. గొంతు మంట ఇంకా, వేడి నీరు తాగడం వల్ల గొంతు మంటగా ఉండే అవకాశం ఉంది. ఇది రోజంతా కొనసాగవచ్చు, తద్వారా మీరు అసౌకర్యంగా గురికావచ్చు.