
హై బీపీని తొందరగా తగ్గించడంలో సహాయపడే 4రకాల డ్రింక్స్
ఈ వార్తాకథనం ఏంటి
హై బీపీ కారణంగా అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి, హార్ట్ ఎటాక్ స్ట్రోక్ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
రెగ్యులర్ గా వ్యాయామం చేయకపోవడం, ఆహారపు అలవాట్లు సరిగ్గా లేకపోవడం, ఊబకాయం, డయాబెటిస్ మొదలగు కారణాల వల్ల హైబీపీ సమస్య వస్తుంది.
అయితే బీపీ పెరిగితే దాన్ని సాధారణ స్థితికి తొందరగా తీసుకురావడానికి కొన్ని డ్రింక్స్ పనిచేస్తాయి. అవేంటో చూద్దాం.
బీట్ రూట్ జ్యూస్:
ఇందులో ఉండే నైట్రేట్ల కారణంగా హై బీపీ తగ్గిపోయి సాధారణ స్థితికి చేరుతుంది. ఎవరైతే రోజూ రెండు కప్పుల తాజా బీట్ రూట్ జ్యూస్ తాగుతారో వారిలో బీపీ లెవెల్స్ తగ్గాయని క్లినికల్ ట్రయల్స్ లో తెలిసింది.
Details
బీపీని తగ్గించడానికి అరటి పండు చేసే సాయం
అల్లం, మామిడి జ్యూస్
ఇందులో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి కాబట్టి వీటి జ్యూస్ తాగడం వల్ల బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది.
అల్లం, మామిడిని ముక్కలుగా కట్ చేసి క్యారెట్ జ్యూస్, తేనే, ఐస్ క్యూబ్స్, యాలకుల పొడిని గ్రైండర్లో వేసి రుబ్బితే జ్యూస్ తయారైపోయినట్టే.
మందార పువ్వు టీ
కొన్ని ఎండిపోయిన మందార పువ్వులను 10-15నిమిషాల పాటు నీళ్లలో మరిగించాలి. దీనికి తేనె కలిపి మరిగించి వడబోసి రోజు మూడు కప్పులు తాగాలి.
అరటిపండు జ్యూస్
పాలకూరను, అరటి పండును చిన్నగా కత్తిరించి పక్కన పెట్టుకోవాలి. ఈ రెండింటిని గ్రైండర్ లో వేసి బాగా రుబ్బాలి. ఇప్పుడు ఈ మిశ్రమానికి కొన్ని నీళ్లు, ఆరెంజ్ జ్యూస్ కలిపితే జ్యూస్ తయారవుతుంది.