
ప్రెగ్నెన్సీ సమయంలో డయాబెటిస్: తగ్గించేందుకు పాటించాల్సిన పద్దతులు
ఈ వార్తాకథనం ఏంటి
మహిళలు గర్భం దాల్చినపుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. గర్భాన్ని మోసే 9నెలల సమయంలో ఆరోగ్యపరంగా అనేక జాగ్రత్తలు తీసుకోవాలి.
సాధారణంగా ప్రెగ్నెన్సీ మహిళల్లో కొంతమందికి షుగర్ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. తలిదండ్రులకు షుగర్ వ్యాధి ఉంటే పిల్లల్లో ప్రెగ్నెన్సీ సమయంలో వచ్చే అవకాశం ఉంది.
అలాగే కొన్నిసార్లు ఆహార అలవాట్లలో తేడాలు మొదలగు కారణాల వల్ల రక్తంలో చక్కెర శాతం పెరుగుతుంది.
ప్రెగ్నెన్సీ సమయంలో వచ్చే షుగర్ వ్యాధి, బిడ్డ పుట్టిన తర్వాత తగ్గిపోతుంది. కొంతమందిలో మాత్రం టైప్ 2 డయాబెటిస్ కి దారి తీసే అవకాశం ఉంది.
వారసత్వంగా వచ్చే దాన్ని ఆపలేము కానీ, ఆహార అలవాట్లు, ఇతర కారణాల వల్ల వచ్చే చక్కెర వ్యాధిని నియంత్రించవచ్చు.
Details
ప్రెగ్నెన్సీ సమయంలో వచ్చే డయాబెటిస్ లక్షణాలు
ప్రెగ్నెన్సీ సమయంలో షుగర్ వచ్చిందని, విపరీతమైన దాహం, తరచుగా మూత్ర విసర్జన.. మొదలగు లక్షణాల వల్ల తెలుసుకోవచ్చు. ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.
డయాబెటిస్ రాకుండా ఉండాలంటే:
రోజువారి దినచర్యలో ఆరోగ్యకరమైన ఆహారన్ని తీసుకోవాలి. కూరగాయలు, పండ్లు ఎక్కువగా తింటే శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. చిరుతిండి తగ్గించాలి.
ఐదు నెలల తర్వాత వాకింగ్ చేయడం ప్రారంభించాలి. అరగంటకు పైగా ప్రతీరోజూ నడిస్తే ప్రెగ్నెన్సీ సమయంలో వచ్చే షుగర్ వ్యాధిని అరికట్టే అవకాశం ఉంటుంది.
శరీరానికి విశ్రాంతిని ఇవ్వాలి. కావాల్సినంత నిద్రపోతే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. సరిగ్గా నిద్రపోవాలంటే ఎలాంటి ఒత్తిడి ఉండకూడదు.
ప్రతిరోజూ ఆనందంగా ఉండటం, ఆహ్లాదంగా ఉండడం వల్ల డయాబెటిస్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి.