
చక్కెర వ్యాధిని అదుపులో ఉంచే అద్భుతమైన పానీయాలు
ఈ వార్తాకథనం ఏంటి
రక్తంలో చక్కెర శాతం పెరగడం, ఇన్సులిన్ ఉత్పత్తి కాకపోవడం లేదా తక్కువగా ఉత్పత్తి కావడం మొదలగు కారణాల వల్ల డయాబెటిస్ వ్యాధి వస్తుంది.
డయాబెటిస్ వ్యాధితో బాధపడేవారు, తాము తీసుకునే ఆహారంలో జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి ఆహారాలు తీసుకుంటే డయాబెటిస్ ని నియంత్రించవచ్చో తెలుసుకోవాలి.
ప్రస్తుతం డయాబెటిస్ ని తగ్గించే పానీయాల గురించి మాట్లాడుకుందాం.
కాకర కాయ జ్యూస్:
రోజూ పొద్దున్న ఒక గ్లాసు కాకర కాయ జ్యూస్ తాగితే చాలా మంచిది. దీనివల్ల రక్తంలో చకెర స్థాయిలు పెరగకుండా నియంత్రణలో ఉంటాయి.
కాకర జ్యూస్ వల్ల బరువు కూడా తగ్గుతారు. దీనిలోని పోషకాలు రక్తంలో గ్లూకోజ్ ఉత్పత్తిని తగ్గిస్తాయి.
Details
జీర్ణక్రియను నెమ్మది చేసే మెంతులు
మెంతుల పానీయం:
ఒకానొక అధ్యయనం ప్రకారం, రోజూ 10గ్రాముల మెంతులను గోరువెచ్చని నీళ్ళలో నానబెట్టి తాగితే టైప్ 2 డయాబెటిస్ నుండి కొంతమేర ఉపశమనం పొందవచ్చు.
మెంంతుల్లో ఉండే ఫైబర్, జీర్ణక్రియను నెమ్మది చేస్తుంది. కార్బోహైడ్రేట్లను, చక్కెరను శరీరం తీసుకోవడంలో నియంత్రణ పాటిస్తుంది.
ధనియాల పానీయం: ధనియాల్లో ఉండే ఫ్లెవనాయిడ్లు చక్కెరను నియంత్రించడంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. తద్వారా ఇన్సులిన్ ఉత్పత్తి పెరిగి చక్కెర వ్యాధి ఇబ్బందులు తగ్గుతాయి.
రెండు లీటర్ల నీటిలో 10గ్రాముల ధనియాలను రాత్రి నానబెట్టి తెల్లారి లేచిన తర్వాత నీటిని వడబోసి తాగాలి.
తులసి పానీయం:
ఒక గ్లాసు నీళ్ళలో కొన్ని తులసి ఆకులు, అల్లం ముక్క వేసి నీటిని మరిగించి నిమ్మరసం కలుపుకుని తాగాలి.