DUSERA : దేవి నవరాత్రుల షెడ్యూల్.. అక్టోబర్‌లో వచ్చే పండుగల లిస్ట్ ఇదే
అక్టోబర్ నెల వచ్చిందంటే చాలు అందరి కళ్లు దసరా మీదే. ఈ మేరకు దేవి శరన్నవరాత్రులను అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారిని కొలుస్తారు. మరోవైపు ఇదే నెలలోనే పూర్వీకులకు, పితృ దేవతలకు వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. అక్టోబర్ 2 - సంకష్టహర చతుర్థి. ఈరోజున వినాయకుడిని ఆరాధిస్తారు. జీవితంలో సమస్యలన్నీ తొలగిపోవాలంటే ఉపవాసం ఉంటూ, రాత్రి చంద్రారాధన చేస్తారు. అక్టోబర్ 6 శుక్రవారం - మహాలక్ష్మి వ్రతం. మహిళలు తమ పిల్లల పురోగతి, భర్త శ్రేయస్సు, దీర్ఘాయువు కోసం వ్రతాన్ని ఆచరిస్తారు. అక్టోబర్ 10 మంగళవారం - ఇందిరా ఏకాదశి పితృపక్షంలో వచ్చే ఈ ఏకాదశి అత్యంత ప్రత్యేకమైందిగా భావిస్తారు.దీన్నే ఏకాదశి తిథిగా నిర్వహిస్తారు. ఏకాదశిన మరణించిన వారికి వైకుంఠలో స్థానం లభిస్తుంది.
14వ తేదీన బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభం
అక్టోబర్ 11 బుధవారం - ప్రదోష వ్రతం అక్టోబర్ 14 శనివారం - మహాలయ అమావాస్య, సూర్యగ్రహణంఐ మహాలయ అమావాస్యను పితృ పక్షం ఆఖరి రోజు అంటారు. కుటుంబీకుల మరణం తేదీ తెలియకపోయినా, ఏదైనా కారణాలతో చనిపోయిన తేదీన శ్రాద్ధం చేయలేని వారు సర్వ పితృ అమావాస్య సందర్భంగా శ్రాద్ధం, తర్పణ, పిండ ప్రదానం చేస్తారు. ఇదే రోజున తెలంగాణలో బతుకమ్మ ఉత్సవాలు కూడా ప్రారంభం అవుతాయి. అక్టోబర్ 15 ఆదివారం - శారదీయ నవరాత్రి అక్టోబర్ 18 బుధవారం - తులా సంక్రాంతి, అశ్వయుజ వినాయక చతుర్థి, ఈరోజున సూర్యుడు కన్యారాశి నుంచి తులారాశిలోకి ప్రవేశిస్తాడు. సూర్యారాధనకు ఇది ఉత్తమం.
అక్టోబర్ 29న- కార్తీక మాసం ప్రారంభం
అక్టోబరు 25న - పాపాంకుశ ఏకాదశి అక్టోబర్ 26న - ప్రదోష వ్రతం (శుక్ల) అక్టోబర్ 29న- కార్తీక మాసం ప్రారంభం మరోవైపు అక్టోబర్ 15 నుంచి 23 వరకు దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు జరగనున్నారు. తొమ్మిది రోజుల పాటు వివిధ రూపాల్లో అలంకారాలతో దుర్గమ్మ దర్శన భాగ్యం ఇవ్వనుంది. 1. అక్టోబర్ 15న - శ్రీ బాల త్రిపుర సుందరీ దేవి అలంకారం 2. అక్టోబర్ 16న - శ్రీ గాయత్రీ దేవి అలంకారం 3. అక్టోబర్ 17న శ్రీ అన్నపూర్ణా దేవి అలంకారం 4. అక్టోబర్ 18న శ్రీ మహాలక్ష్మి దేవి అలంకారం
ఈనెల 24న దసరా
5. అక్టోబర్ 19న శ్రీ మహా చండీ దేవి అలంకారం 6. అక్టోబర్ 20 న శ్రీ సరస్వతీ దేవి అలంకారం (మూలానక్షత్రం) 7. అక్టోబర్ 21 న శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అలంకారం 8. అక్టోబర్ 22 న శ్రీ దుర్గాదేవి అలంకారం 9. అక్టోబర్ 23న శ్రీ మహిషాసురమర్ధనీ దేవి అలంకారం 10. అక్టోబర్ 24న శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారం. నవరాత్రుల్లో ఇదే చివరిదైన 9వ రోజుగా భావిస్తున్నారు. 24 అక్టోబర్ 2023 (మంగళవారం)- దసరా దీన్నే విజయదశమిగా పిలుస్తారు. ఈరోజు దుర్గామాత విగ్రహాన్ని నిమజ్జనం చేస్తారు. దీంతో పాటు రావణ దహనం కూడా నిర్వహిస్తుంటారు.