Dussehra Special: దసరా స్పెషల్.. అమ్మవారి దశావతారాలు.. జీవితానికి ప్రేరణ ఇచ్చే పాఠాలు
ఈ వార్తాకథనం ఏంటి
దసరా వస్తుంది అంటేనే దేవీ నవరాత్రి ఉత్సవాలు.. గర్బ డ్యాన్స్.. దాండియా నృత్యాలు గుర్తొస్తాయి. దసరాకు పదిరోజుల ముందే దేవీ నవరాత్రులు ప్రారంభమవుతాయి.
నవరాత్రుల్లో ప్రతిరోజు ఒక్కో అవతారంలో దుర్గా మాతను భక్తులు కొలుస్తారు.
ఈ లోకాన్ని రక్షించడానికి విష్ణుమూర్తి దశావతారాలు ఎత్తినట్టుగా లోక రక్షణ కోసం దేవీమాత కూడా దశావతారాలు ఎత్తుతుంది.
మరి దశావతారాలు మనకు ఇచ్చే సందేశం ఏమిటీ? ఆ అవతారాల నుంచి మనం ఏం నేర్చుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..?
1) స్వర్ణకవచ దుర్గ
నిన్ను నువ్వే రక్షించుకోవాలి. ధైర్యం, దృఢత నీలో ఉండాలి. నీ వ్యక్తిత్వాన్ని మెరుగు పరచడం ద్వారా మాత్రమే ఈ రక్షణ సాధ్యమవుతుంది.
Details
2)బాలాత్రిపుర సుందరి
మీ బాల్యాన్ని ఆస్వాదించండి. ఉల్లాసంగా ఉండి, మీ జీవితాన్ని మీ స్వంతంగా ఆస్వాదించండి. ఇది బాలాత్రిపుర అమ్మవారి సందేశం.
3)అన్నపూర్ణా దేవి
ఆరోగ్యంగా జీవించడం ముఖ్యం. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మీకు తప్పనిసరిగా చేయాల్సిందే. మానసిక ఆరోగ్యం కూడా చాలా అవసరం. అందుకు అవసరమైన శక్తిని ఇతరులకు పంచండి. 4)గాయత్రీ దేవి
నవ్వు నీ ఆధీనంలో ఉండాలి. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, పోరాడటానికి సిద్ధంగా ఉండండి. మీరు నిశ్చయంగా ఉంటే ప్రపంచాన్ని గెలవచ్చు.
5)లలితాత్రిపుర సుందరి
మీ ఆత్మ సౌందర్యం ప్రాముఖ్యం ఉంది. మంచి ఆలోచనలు, మంచి పనులు మీ ఆత్మసౌందర్యాన్ని పెంపొందిస్తాయి. అందుకే మీలోని సౌందర్యాన్ని గుర్తించండి.
Details
6)సరస్వతీ దేవి
ఈ ప్రపంచాన్ని తెలుసుకోవడం ముఖ్యం. ప్రతి విషయం గురించి క్షుణ్ణంగా పరిశీలించండి. మీరు తెలుసుకున్నది మీ శక్తిని పెంచుతుంది. మీరు మరింత తెలుసుకోవాలనే తపనతో ఉండాలి.
7)మహాలక్ష్మీ దేవి
స్వతంత్రంగా ఉండండి. మీ భవిష్యత్తును మీరు నిర్మించాలి. మీ లక్ష్యాలను ఖచ్చితంగా నిర్దేశించుకొని వాటి కోసం పనిచేయండి.
8) దుర్గాదేవి
సరైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మీరు శక్తివంతుడిగా మారండి. నిరంతరం శ్రమించి, ఇతరుల కంటే భిన్నంగా ఉండండి.
9) మహిషాసుర మర్దిని
మీ శక్తిని తక్కువ అంచనా వేయకండి. అందరికీ అందనంత ఎత్తుల్లో ఉండటానికి శ్రమించండి. ఈ అవతారాన్ని మహార్నవమిగా జరుపుకుంటాం. 1
10) రాజరాజేశ్వరీ దేవి
విజయానికి మీ భ్రమలను అధిగమించాలి. నిజమైన జీవితంలో శాంతిని వెతుక్కోవాలి.