LOADING...
Dasara Sweet Recipes: దసరా స్పెషల్‌ స్వీట్స్‌.. పెసరపప్పు లడ్డూ, పాల బూరెలు ఇలా చేసేయండి

Dasara Sweet Recipes: దసరా స్పెషల్‌ స్వీట్స్‌.. పెసరపప్పు లడ్డూ, పాల బూరెలు ఇలా చేసేయండి

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 16, 2025
03:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

దసరా పండుగ అంటే ఇల్లు ఆనందంతో, పిండివంటల సువాసనతో కళకళలాడుతుంది. ఎప్పుడూ చేసే బూరెలు, గారెలకే పరిమితం కాకుండా ఈసారి కాస్త కొత్తగా పెసరపప్పు లడ్డూ, పాల బూరెలు చేసి చూడండి. వీటిని అమ్మవారికి ప్రసాదంగా పెట్టుకోవచ్చును. ఇంటికి వచ్చిన అతిథులకు వడ్డించవచ్చు కూడా. వీటిని తయారు చేయడం చాలా సులభం. ఎలా చేయాలో చూద్దాం.

Details

 పెసరపప్పు లడ్డు రెసిపీ

కావలసిన పదార్థాలు పెసరపప్పు - 1 కప్పు డ్రై ఫ్రూట్స్‌ (జీడిపప్పు, బాదం, కిస్‌మిస్‌) - ¼ కప్పు యాలకుల పొడి - ½ స్పూను నెయ్యి - ¼ కప్పు పంచదార - 1 కప్పు

Details

 తయారీ విధానం 

1. స్టవ్‌పై కళాయి పెట్టి పెసరపప్పును వేయించాలి. 2. చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. 3. తర్వాత పంచదారను కూడా మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. 4. పెసరపప్పు పొడి, పంచదార పొడిని జల్లెడతో జల్లాలి, ఉండలు లేకుండా చూసుకోవాలి. 5. కళాయిలో నెయ్యి వేడి చేసి అందులో ఈ రెండు పొడులను, యాలకుల పొడిని వేసి బాగా కలపాలి. 6.పెద్ద మంట పెట్టకుండా చిన్న మంట మీదనే కలుపుకుంటూ ఉండాలి, లేదంటే మిశ్రమం మాడిపోతుంది. 7.దగ్గరగా అయ్యాక డ్రై ఫ్రూట్స్ వేసి కలపాలి. 8. ముద్దలా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి మిశ్రమం చల్లారనివ్వాలి. 9. చేతికి నెయ్యి రాసుకుని లడ్డూలుగా చుట్టుకుంటే పెసరపప్పు లడ్డూలు రెడీ.

Details

పాల బూరెలు రెసిపీ 

కావలసిన పదార్థాలు బియ్యప్పిండి - 3 కప్పులు మైదా - 1 కప్పు బెల్లం తురుము - 2 కప్పులు పాలు - 1½ కప్పు యాలకుల పొడి - ½ స్పూను ఉప్పు - చిటికెడు నూనె - డీప్ ఫ్రైకి సరిపడా

Details

తయారీ విధానం 

1. బియ్యప్పిండి, మైదా, ఉప్పు, యాలకుల పొడి అన్నీ ఒక గిన్నెలో వేసి కలపాలి. 2.మరో గిన్నెలో బెల్లాన్ని కరిగించి నీరులా చేసుకోవాలి. 3. ఆ బెల్లం నీటిని, పాలను పిండి మిశ్రమంలో వేసి కలపాలి. 4. మిశ్రమం చాలా మందంగా కాకుండా, పల్చగా కాకుండా - కాస్త జారుడు మిశ్రమంలా ఉండాలి. 5.కళాయిలో నూనె వేడి చేసి, ఒక గరిటతో మిశ్రమం తీసి నూనెలో బూరెల్లా వేయాలి. 6.రెండు వైపులా బంగారు రంగు వచ్చేవరకు వేయించి తీసేయాలి. 7.అంతే, రుచికరమైన పాల బూరెలు రెడీ. దసరా పండుగలో ఈ రెండు స్పెషల్‌ రెసిపీలు ఇంట్లో తయారు చేసి చూడండి. అమ్మవారికి ప్రసాదంగా పెట్టుకోవచ్చును, అలాగే కుటుంబ సభ్యులు, అతిథులందరినీ రుచితో అలరించవచ్చును.