Health Tips: కివీ పండు తింటున్నారా? ఇందులో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసా?
కివీ పండ్లు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో విటమన్ సి పుష్కలంగా ఉండటంతో వీటిని తీసుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు. ఇవి తినడానికి కాస్త పుల్లగా, తియ్యగా ఉంటాయి. కొందరు వీటిని నేరుగా ఉంటే మరికొందరు జ్యూస్ రూపంలో తీసుకుంటారు. కివీ పండ్లు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అదే విధంగా అధిక రక్తపోటు సమస్యతో బాధపడేవారు కివీ పండ్లను తినాలి. కివీలో యాంటి ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ వైరల్, యాంటీ ఇన్ఫెక్షన్ లక్షణాలు వంటి అనేక లక్షణాలు ఉంటాయి. కివీ పండ్లు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. మరోవైపు వీటిని తినడం వల్ల ఎలర్జీ సమస్యలు వచ్చే అవకాశముంది.
కివీ పండులో డయోరియా సమస్యలు రావొచ్చు
కివీలో ఎక్కువగా విటమిన్ సి, విటమిన్ బి6, ఫైబర్, పోటాషియం, కాల్షియం, కార్బోహైడ్రేట్స్, రైబోప్లెవిన్, బీటా కెరోటిన్ వంటి విటమన్లు, ఖనిజాలు ఇందులో పుష్కలంగా లభిస్తాయి. ఈ పండ్లను ఎక్కువగా తీసుకోవడం వల్ల నోటి అలర్జీ సిండ్రోమ్ వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. మరోవైపు పెదవులు, నాలుక వాపు, నోటి లోపల పుండ్లు లాంటి సమస్యలు మొదలవుతాయి. కివీ పండులో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల డయోరియా సమస్యలు రావొచ్చు. అంతేకాకుండా కడుపు నొప్పి, వాంతులు వంటి సమస్యలు వచ్చే అవకాశముంది. ఇలాంటి వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.