sweet potatoes health benefits : చిలగడదుంప తింటే క్యాన్సర్ సమస్యకు చెక్!
ఈ వార్తాకథనం ఏంటి
చిలగడదుంపను స్వీట్ పొటాటో అని కూడా పిలవచ్చు. దీంతో అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
రక్తంలో చక్కెర నియంత్రణతో పాటు, క్యాన్సర్ సహా అనేక పోషకాహార ప్రయోజనాలకు కూడా అందిస్తున్నారు.
ముఖ్యంగగా గ్లూకోజ్ స్థాయిలను సమతుల్యం చేయటంతో ఇవి సాయపడతాయి.
ఫైబర్, విటమన్లు, మినరల్స్ వంటి ముఖ్యమైన పోషకాలతో చిలగడదుంపలు ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి.
వీటిని వివిధ రూపాల్లో కూడా ఆహారంగా తీసుకోవచ్చు. కొంతమంది వీటిని కాల్చుకొని తింటారు. మరికొంతమంది ఉడికించి మరి తింటారు.
చిలగడ దుంపల్లో శరీరానికి శక్తిని, పోషకాలను అందించే గుణాలున్నాయి.
Details
చిలగడ దుంపలతో ఆరోగ్య ప్రయోజనాలు అధికం
చిలగడ దుంపలలో ఫైబర్, విటమన్లు, ఏ, సీ, బీ6, పోటాషియం, మాంగనీస్, యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉండటంతో వ్యాధులు రాకుండా చేస్తాయి.
ప్రధానంగా పోషకాహార లోపం సమస్య రాకుండా చూస్తాయి.
ఇది కంటి చూపును మెరుగుపరచడంతో పాటు, జీర్ణశక్తిని పెంచుతుంది.
చిలగడ దుంపలు ముత్రాశయం, పెద్ద ప్రేగు, కడుపు, రొమ్ములో పెరిగే కాన్యర్ కణాల పెరుగుదలను తగ్గిస్తాయి.
ఇక వీటిని తినడం వల్ల మెదడు పనితీరు కూడా మెరుగుపడుతుంది.
బరువు తగ్గాలని అనుకొనే వారు చిలగడ దుంపలను తింటే మంచిది.షుగర్ పేషంట్స్ కూడా వీటిని తినవచ్చు.