LOADING...
Ramadan 2026: రంజాన్ పండుగ ఎప్పుడు? ఐఏసీ క్లారిటీ
Ramadan 2026: రంజాన్ పండుగ ఎప్పుడు? ఐఏసీ క్లారిటీ

Ramadan 2026: రంజాన్ పండుగ ఎప్పుడు? ఐఏసీ క్లారిటీ

వ్రాసిన వారు Moogati Shabari
Mar 13, 2026
05:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే రంజాన్ పండుగ తేదీపై ప్రతి సంవత్సరం కొంత సందిగ్ధత ఉంటుంది. ఇస్లామీయ హిజ్రీ క్యాలెండర్‌లోని 'షావల్' నెల మొదటి రోజున ఈ పండుగను జరుపుకుంటారు. అయితే భౌగోళిక పరిస్థితులు, కాలమాన వ్యత్యాసాల కారణంగా వేర్వేరు దేశాల్లో నెలవంక కనిపించే సమయం మారుతుంది. రంజాన్ మాసం ముగింపు, పండుగ ప్రారంభం అన్నీ కూడా నెలవంక దర్శనంపై ఆధారపడి ఉంటాయి. దీనిపై స్పష్టత ఇవ్వడానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన పరిశీలనా కేంద్రం వివరాలు వెల్లడించాయి.

వివరాలు

నెలవంక దర్శనమే కీలకం

సౌదీ అరేబియా,అరబ్ వంటి గల్ఫ్ దేశాల్లో రంజాన్ ఉపవాసాలు ఫిబ్రవరి 18న ప్రారంభమయ్యాయి. అక్కడ మార్చి 18న నెలవంక కనిపించే అవకాశం ఉందని అంచనా. అందువల్ల ఆ దేశాల్లో మార్చి 19న రంజాన్ పండుగ జరుపుకునే అవకాశముంది. భారతదేశంలో ఉపవాసాలు ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభమయ్యాయి. కాబట్టి మార్చి 19న నెలవంక దర్శనం జరిగే అవకాశం ఉంది. అందువల్ల ఇండియాలో మార్చి 20న ఈద్ ఉల్ ఫితర్ పండుగ జరుపుకునే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. సౌదీలో సెలవులు రంజాన్ పండుగ సందర్భంగా సౌదీ అరేబియా ప్రభుత్వం ప్రైవేట్,లాభాపేక్ష లేని రంగాల ఉద్యోగులకు నాలుగు రోజుల సెలవులు ప్రకటించింది. రంజాన్ 29వ రోజైన మార్చి 18 నుంచి ఈ సెలవులు అమల్లోకి వస్తాయి.

Advertisement