LOADING...
National Engineers Day 2024: ఇంజినీర్ల దినోత్సవ ప్రత్యేకత.. సాంకేతిక ఆవిష్కరణలకు స్ఫూర్తిదాయక నేత మోక్షగుండం విశ్వేశ్వరయ్య 
ఇంజినీర్ల దినోత్సవ ప్రత్యేకత.. సాంకేతిక ఆవిష్కరణలకు స్ఫూర్తిదాయక నేత మోక్షగుండం విశ్వేశ్వరయ్య

National Engineers Day 2024: ఇంజినీర్ల దినోత్సవ ప్రత్యేకత.. సాంకేతిక ఆవిష్కరణలకు స్ఫూర్తిదాయక నేత మోక్షగుండం విశ్వేశ్వరయ్య 

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 15, 2024
01:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ ఆధునిక యుగంలో ప్రతి రంగంలోనూ ఇంజనీర్ల పాత్ర అమూల్యమైంది. నూతన ఆవిష్కరణల ద్వారా సమాజంలో మానవ జీవితానికి కీలకమైన మార్పులు తెస్తూ, అభివృద్ధి బాటలో దేశాలను నడిపించడంలో ఇంజనీర్లు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఇలాంటి వారి సేవలను గుర్తించేందుకు ప్రతేడాది సెప్టెంబర్ 15న జాతీయ ఇంజనీర్ల దినోత్సవం జరుపుకుంటారు. ఈ రోజును ప్రత్యేకంగా జరుపుకోవడం వెనుక ఉన్న ప్రధాన కారణం భారతదేశంలో గౌరవనీయమైన ఇంజనీర్ సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని స్మరించుకోవడమే.

Details

హైదరాబాద్ వరద నియంత్రణలో విశ్వేశ్వరయ్య పాత్ర

1861 సెప్టెంబరు 15న జన్మించిన ఆయన, భారతదేశ మౌలిక సదుపాయాల అభివృద్ధికి చేసిన కృషి కోసం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. డెక్కన్ పీఠభూమిలోని నీటిపారుదల వ్యవస్థ అభివృద్ధిలో, మైసూర్ కృష్ణ రాజ సాగర డ్యామ్ వంటి ప్రాజెక్టుల్లో ఆయన కీలకంగా పనిచేశారు. 1908లో హైదరాబాద్‌లో భారీ వరదలు సంభవించి, లక్షల మంది నిరాశ్రయులైన తరుణంలో, విశ్వేశ్వరయ్య తన అద్భుతమైన జ్ఞానంతో విపత్తును ఎదుర్కొనే ప్రణాళికలు రూపొందించారు. ఈ ప్రణాళికల ద్వారా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ వంటి ప్రాజెక్టులు రూపుదిద్దుకున్నాయి.

Details

వరదల ముప్పు బయటపడిన హైదరాబాద్

ఆయన సూచనల ఫలితంగా, హైదరాబాద్ నగరం కొన్నేళ్ల పాటు వరద ముప్పు నుంచి తప్పించుకుంది. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలను స్మరించుకుంటూ, ఆయన చేసిన కృషికి గౌరవంగా, సెప్టెంబర్ 15న జాతీయ ఇంజనీర్ల దినోత్సవం జరుపుకుంటారు. ఇంజనీర్ల కృషి ప్రపంచవ్యాప్తంగా సంక్లిష్టమైన సమస్యలను పరిష్కరించడంలో, సాంకేతికతను అభివృద్ధి చేయడంలో, ప్రజల జీవన నాణ్యతను మెరుగుపరచడంలో ఎనలేనిదిగా పేరుగాంచింది