Padma Shri Dr Jogesh Deuri: ఎరి సిల్క్ రంగంలో పయనీర్ డా. జోగేష్ డియూరికి పద్మశ్రీ
ఈ వార్తాకథనం ఏంటి
అస్సాం రాష్ట్ర సంప్రదాయ జ్ఞాన వ్యవస్థలు,గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు దేశస్థాయిలో గుర్తింపు లభించింది. గోల్పారా జిల్లా చెందిన ప్రముఖ ఎరి, పట్టు నిపుణుడు డా.జోగేష్ డియూరికి 2026సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును ప్రకటించింది. భారత సీరికల్చర్ రంగాన్ని బలోపేతం చేయడంలో,అస్సాం దేశీయ పట్టు సంప్రదాయాలను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడంలో ఆయన చేసిన దీర్ఘకాల సేవలకు ఈ గౌరవం లభించింది. గోల్పారా జిల్లాలోని దుద్నాయ్ ఉపవిభాగం,దరంగ్‌గిరి గ్రామానికి చెందిన డా.డియూరి,అస్సాం సీరికల్చర్ శాఖ మాజీ డైరెక్టర్. ఎరి,ముగా,ప్యాట్ పట్టు రంగాల్లో దేశంలోనే అగ్రగణ్య నిపుణుడిగా ఆయనకు పేరు ఉంది. గ్రామీణస్థాయి నుంచి జాతీయ గుర్తింపు దాకా ఆయన సాగించిన ప్రయాణం గోల్పారా సహా అస్సాం అంతటా ఎంతో మందికి ప్రేరణగా మారింది.
వివరాలు
అస్సాం ఎరి, పట్టు ఉత్పత్తులు అంతర్జాతీయ గుర్తింపు
అవార్డు ప్రకటన తర్వాత మీడియాతో మాట్లాడిన డా. డియూరి, సీరికల్చర్ శాఖలో మూడు దశాబ్దాలకు పైగా తాను చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. సంప్రదాయ పట్టు పద్ధతులను ఆధునిక సాంకేతికతతో మేళవించడంలో తాను కీలక పాత్ర పోషించానని చెప్పారు. 2021 మే 31న కొక్రాజార్‌లో డైరెక్టర్‌గా పదవీ విరమణ చేసినప్పటికీ, మరో నాలుగేళ్లు సేవలు కొనసాగించడం ఆయన నిబద్ధతకు నిదర్శనంగా నిలిచింది. ఆయన నాయకత్వంలో అస్సాం ఎరి, పట్టు ఉత్పత్తులు అంతర్జాతీయ గుర్తింపు పొందాయి. దేశీయ అనుభవాన్ని ఆధునిక శాస్త్రీయ విధానాలతో కలిపి, సాంకేతిక అభివృద్ధి, స్థిరత్వం, స్వయం ఉపాధిపై దృష్టి పెట్టారు. దీంతో ఈశాన్య రాష్ట్రాల్లో పట్టు పురుగులు పెంచే రైతుల జీవనాధారం మరింత బలపడింది.
వివరాలు
ఎరి మన భవిష్యత్తు, ముగా మన ఆశ
సీరికల్చర్ ద్వారా ఆర్థిక అభివృద్ధికి చేసిన సేవలకు గుర్తింపుగా 2023లో అస్సాం ప్రభుత్వం డా. డియూరికి ప్రతిష్ఠాత్మక 'అస్సాం గౌరవ్' అవార్డును అందజేసింది. "ఎరి మన భవిష్యత్తు, ముగా మన ఆశ" అనే ఆయన నమ్మకమే ఆయన జీవితానికి మార్గదర్శకం. 2025లో అస్సాం ప్రభుత్వ గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక సత్కారం కూడా అందించింది. ఆయన కెరీర్‌లో కీలక ఘట్టంగా 2013లో ప్రపంచంలోనే తొలి వైల్డ్ ముగా సిల్క్ సాంక్చువరీ ఏర్పాటు నిలిచింది. కేంద్ర పట్టు మండలి, బోడోలాండ్ టెరిటోరియల్ కౌన్సిల్ సీరికల్చర్ శాఖ సహకారంతో, మానస్ జాతీయ ఉద్యానవనం సమీపంలోని కొక్లాంగ్ అటవీ ప్రాంతంలో 300 బిఘాలకు పైగా విస్తీర్ణంలో ఈ సాంక్చువరీ ఏర్పాటైంది.
వివరాలు
ఎరి మన భవిష్యత్తు, ముగా మన ఆశ
ఇది సంరక్షణతో అనుసంధానమైన సీరికల్చర్‌లో చారిత్రక ముందడుగుగా నిలిచింది. పరిపాలనకే పరిమితం కాకుండా, పరిశోధకుడు, వక్త, రచయితగా కూడా డా. డియూరి దేశ, విదేశాల్లో గుర్తింపు పొందారు. పట్టు రైతుల ఆర్థిక భద్రత, గౌరవం, స్థిరమైన జీవనోపాధి మెరుగుపరచడం, అలాగే అస్సాం సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడడం ఆయన సేవల ప్రధాన లక్ష్యంగా కొనసాగుతున్నాయి.