చర్మ సంరక్షణకు ఉపయోగపడే రోజు వారి ఆహారాలు
చర్మం ఆరోగ్యంగా కనిపించడానికి, తేమగా ఉండడానికి రకరకాల పనులు చేస్తుంటారు. కానీ మీకీ విషయం తెలుసా? మనం తినే రోజు వారి ఆహారాలు మన చర్మాన్ని సురక్షితంగా ఉంచుతాయి. ఆ ఆహార పదార్థాలేంటో ఇక్కడ చూద్దాం. తులసి: ఆయుర్వేద లక్షణాలున్న తులసి కారణంగా, చర్మానికి మెరిసే గుణం వస్తుంది. చర్మ సంబంధ అలర్జీలను, చర్మంపై పగుళ్ళను తులసి దూరం చేస్తుంది. తులసి టీ కానీ లేదా రోజూ తులసి ఆకులను నమలడం కానీ చేయాలి. పసుపు: చర్మానికి పసుపు అనేది వరమని చెప్పవచ్చు. ఇందులో యాంటీయాక్సిడెంట్ల కారణంగా మొటిమలు, మంగు, శోభిమచ్చలు తగ్గిపోతాయి. రోజూ రాత్రిపూట పాలల్లో పసుపు వేసుకుని తాగితే మంచి ఫలితం ఉంటుంది.
దోసకాయ, కుంకుమ పువ్వు, వేపాకు వల్ల చర్మానికి కలిగే మేలు
దోసకాయ: దీనిలో నీటిశాతం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల చర్మాన్ని తేమగా ఉంచడంలో సాయపడుతుంది. చర్మం మీద ఏర్పడ్డ గీతలు, గుల్లలను తగ్గిస్తుంది. చనిపోయిన చర్మకణాలను తొలగిస్తుంది. సలాడ్లలో దోసకాయను తినండి. కుంకుమ పువ్వు: దీన్ని కూడా వంటకాల్లో వాడతారు. కుంకుమ పువ్వు వల్ల చర్మం బిగుతుగా మారి యవ్వనంగా తయారవుతుంది. మంగు మచ్చలను తగ్గించడమే కాకుండా కొత్త చర్మ కణాలను పుట్టిస్తుంది. సూప్స్, లేదా ఇతర పానీయాల్లో కుంకుమపువ్వు ను తీసుకోండి. వేప: వేపాకుల్లో బాక్టీరియాలను అంతమొందించే లక్షణాలు ఉన్నాయి. దీనివల్ల చర్మం మీద మొటిమలు రాకుండా ఉంటుంది. దురద, ఇతర ఎలర్జీలను దూరం చేయడంలో వేపాకులు మంచి మేలు చేస్తాయి. రోజూ కొన్ని వేపాకులను నమిలితే ప్రయోజనం ఉంటుంది.