
ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువగా వాడే బియ్యం రకాలు, తెలుసుకోవాల్సిన విషయాలు
ఈ వార్తాకథనం ఏంటి
ఇండియాలో బియ్యం వాడకం ఎక్కువగా ఉంటుంది. మరీ ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో బియ్యంతో చేసిన ఆహారం ప్రధాన వంటకంగా ఉంటుంది.
అయితే ప్రపంచ వ్యాప్తంగా కూడా బియ్యంతో చేసిన ఆహారాలను తినే దేశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఆయా దేశాల్లో బియ్యం రకాలు వేరుగా ఉంటాయి.
ప్రస్తుతం ప్రపంచ దేశాలు వాడే బియ్యంలోని కొన్ని రకాల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం.
జాస్మిన్ రైస్:
పేరు వినగానే ఇలాంటి రైస్ ఉంటుందా అన్న అశ్చర్యం కలుగుతుంది. యెస్, జాస్మిన్ రైస్ రకం ప్రపంచవ్యాప్తంగా చాలా ఫేమస్.
ఈ బియ్యాన్ని ఉడికించినపుడు మల్లెపూల వాసన వస్తుంది కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింది. థాయ్ లాండ్, కంబోడియా దేశాల్లో ఈ బియ్యాన్ని ఎక్కువగా పండిస్తారు.
Details
ప్రోటీన్ అధికంగా ఉండే బియ్యం రకం
వైల్డ్ రైస్:
ఈ రకం బియ్యాన్ని ఉత్తర అమెరికా, కెనడాలోని కొన్ని ప్రాంతాల్లో పండిస్తారు. ఈ బియ్యం రకాన్ని నెమ్మదిగా ప్రవహించే సరస్సుల వద్ద పండిస్తారు. ఈ బియ్యంలో ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.
ఆర్బోరియో రైస్:
ఈ రైస్ రకాన్ని ఇటాలియన్ వంటకాల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ బియ్యం పొట్టి నుండి మధ్య రకం సైజు వరకు ఉంటాయి.
బ్లాక్ రైస్:
దీనికి నలుపు రంగు రావడానికి ముఖ్య కారణం, అందులోని ఆంథోక్యానిన్ అనే పిగ్మెంటే కారణం. ఈ రకమైన పిగ్మెంట్ బ్లాక్ బెర్రీస్ లో ఉంటుంది. ఈ రైస్ లో ప్రోటీన్ అధికంగా ఉంటుంది.
ఈ రైస్ తో అన్నం వండడానికి గంట సమయం పడుతుంది.
Details
బిర్యానీ తయారు చేయడానికి ఎక్కువగా ఉపయోగించే బియ్యం రకం
బాస్మతి బియ్యం:
ఈ బియ్యం గురించి అందరికీ తెలుసు. ఈ బియ్యాన్ని భారతదేశంలో హిమాలయ ప్రాంతంలో ఎక్కువగా పండిస్తారు, అలాగే పాకిస్తాన్ దేశంలోనూ బాస్మతి బియ్యం పండుతుంది.
బాస్మతి రకం బియ్యం గింజ వండిన తర్వాత మూడింతలు అవుతుంది. బాస్మతి బియ్యం మంచి సువాసన కలిగి ఉంటుంది. బిర్యానీలను బాస్మతి బియ్యంతోనే చేస్తారు.
లాంగ్ గ్రెయిన్ రైస్:
ఈ రకం రైస్ ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులో ఉంటుంది. చాలా దేశాల్లో ఈ రకం బియ్యాన్ని పండిస్తారు. అందుకే ఈ బియ్యం ధర మిగతా బియ్యం రకాల ధరలతో పోలిస్తే చాలా తక్కువగా ఉంటుంది.