చేతి వేళ్ళ గోర్లు అందంగా, ఆకర్షణీయంగా పెరగడానికి ఏం చేయాలంటే?
జుట్టును, చర్మాన్ని ఎలాగైతే సంరక్షించుకుంటామో చేతివేళ్ళ గోర్లను కూడా అలాగే సంరక్షించుకోవాలి. కొంతమందికి గోర్లు అందంగా, ఆకర్షణీయంగా ఉంటాయి. మరికొంతమందిలో విరిగిపోయినట్లు కనిపిస్తాయి. ప్రస్తుతం చేతివేళ్ల గోర్లను పెంచడానికి ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం. నారింజ, కొబ్బరి నూనె మీ చేతి వేళ్ళ గోర్లు బలహీనంగా, విరిగిపోయినట్టుగా ఉంటే నారింజ బాగా పనిచేస్తుంది ఇందులోని సి విటమిన్ మీ గోర్లను బలంగా తయారు చేస్తుంది. నారింజ జ్యూస్ ని ఒక పాత్రలో పోసి దానికి ఆలివ్ ఆయిల్ కలిపి గోరువెచ్చని కొబ్బరి నూనెను కలిపి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమంలో చేతివేళ్లను ముంచి పది నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.
గోర్ల అందాన్ని పెంచే గుడ్డు పెంకులు
పెట్రోలియం జెల్లీ రాత్రి పడుకునే ముందు, పెట్రోలియం జెల్లీని గోర్లకు అప్లై చేసుకోవాలి. తెల్లారి లేచిన తర్వాత శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. నిమ్మరసం, ఆలివ్ ఆయిల్ నిమ్మరసంలో ఆలివ్ ఆయిల్ కలిపి కొద్దిసేపు వేడి చేయాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని గోర్లకు అప్లై చేయాలి. గంట తర్వాత గోరువెచ్చని నీటితో గోర్లను కడుక్కోవాలి. గుడ్డు పెంకులు మీ గోళ్లు విరిగిపోయినట్లుగా, అందవిహీనంగా ఉంటే గుడ్డు పెంకులు బాగా పనిచేస్తాయి. గుడ్డు పెంకులను బాగా నలగ్గొట్టి పౌడర్ తయారు చేయాలి. ఈ పౌడర్ ను నెయిల్ పాలిష్ లో కలిపేసి, పడుకునే ముందు గోర్లకు వేసుకోవాలి. తెల్లారి లేచిన తర్వాత శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.