NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / జుట్టు రాలిపోకుండా, పొడుగ్గా పెరగడానికి వాడాల్సిన ఆయిల్ 
    తదుపరి వార్తా కథనం
    జుట్టు రాలిపోకుండా, పొడుగ్గా పెరగడానికి వాడాల్సిన ఆయిల్ 
    జుట్టు పెరుగుదలకు ఉపయోగపడే అల్లం నూనె

    జుట్టు రాలిపోకుండా, పొడుగ్గా పెరగడానికి వాడాల్సిన ఆయిల్ 

    వ్రాసిన వారు Sriram Pranateja
    May 25, 2023
    06:38 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఈ కాలంలో జుట్టు సమస్యలు ప్రతీ ఒక్కరికీ వస్తున్నాయి. యవ్వనంలోనే జుట్టు రాలిపోవడం, తెల్లబడటం.. మొదలగు సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయి.

    జుట్టు సమస్యలు రావడానికి కారణాలు:

    జుట్టుకు సరైన పోషకాలు అందకపోవడం, అంటే జుట్టుకు పోషణ అందించే ఆహారాలను తీసుకోకపోవడం, రసాయనాలుండే జుట్టు ప్రోడక్టులు వాడటం, కాలుష్యం, ఒత్తిడి, హార్మోన్లు సరిగ్గా విడుదల కాకపోవడం, లేదా ఎక్కువ విడుదల కావడం.. ఇలా అనేక కారణాలున్నాయి.

    అయితే జుట్టును ఆరోగ్యంగా ఉంచడానికి కొన్ని ఆయిల్స్ పనిచేస్తాయి. వాటిల్లో ప్రస్తుతం జింజర్ ఆయిల్ (అల్లం నూనె) గురించి చెప్పుకుందాం.

    అల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అలాగే రక్తప్రసరణను మెరుగుపరిచే పోషకాలు ఇందులో ఉంటాయి. అందుకే జుట్టు సంరక్షణకు ఇది బాగా ఉపయోగపడుతుంది.

    Details

    అల్లం నూనెను ఎలా వాడాలంటే? 

    జుట్టుకు సరైన పోషణ అందాలంటే, ఒక టేబుల్ స్పూన్ అల్లం నూనె తీసుకుని, రెండు టేబుల్ స్పూన్ల జోజోబా ఆయిల్ లో కలపాలి.

    ఈ మిశ్రమాన్ని జుట్టుకు మర్దన చేయాలి. ఆ తర్వాత 20నిమిషాలకు తలస్నానం చేస్తే సరిపోతుంది. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే బాగుంటుంది.

    అల్లం నూనెలో కొబ్బరి నూనె కలుపుకుని కూడా జుట్టుకు మర్దన చేసుకోవచ్చు. మర్దన చేసుకున్న తర్వాత 20నిమిషాలకు తలస్నానం చేయాలి. వారంలో రెండుసార్లు ఇలా చేయాలి.

    దీనివల్ల వెంట్రుకల కుదుళ్ళు బలపడతాయి. జుట్టుకు పోషణ అంది, వెంట్రుకలు ఊడిపోకుండా ఉంటాయి.

    అలాగే ఆహారంలో జుట్టుకు పోషకాలను అందించే ఆహారాలైన, బాదం, సోయా, పనీర్, వాల్ నట్స్, పప్పు ధాన్యాలు, వేరుశనగలు తీసుకుంటే మంచిది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కేశ సంరక్షణ
    అందం

    తాజా

    Trade deal: భారత్‌తో త్వరలో వాణిజ్య ఒప్పందం: అమెరికా వాణిజ్య కార్యదర్శి అమెరికా
    World Bicycle Day: రోజూ సైకిల్ తొక్కడం వల్ల ఏం జరుగుతుంది..? నేడు ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా తెలుసుకోండి! జీవనశైలి
    Brahmaputra water: బ్రహ్మపుత్రపై పాక్ ప్రచారాన్ని ఖండించిన అస్సాం సీఎం   హిమంత బిస్వా శర్మ
    North East: ఎడతెరిపి లేని వర్షాలతో వణికుతున్న ఈశాన్య భారతం  భారీ వర్షాలు

    కేశ సంరక్షణ

    ఇంట్లోనే తయారు చేసుకోగలిగే చుండ్రును పోగొట్టే షాంపూలు లైఫ్-స్టైల్
    మీ జుట్టు ఎక్కువగా ఊడిపోతుంటే ఈ ఆహారాలను తినడం మానుకోండి లైఫ్-స్టైల్
    జుట్టుకు మృదుత్వాన్ని, అందాన్ని తీసుకొచ్చే హెయిర్ టోనర్ గురించి తెలుసుకోండి లైఫ్-స్టైల్
    హోళీ రంగులు మీ జుట్టును పాడుచేయకుండా ఉండాలంటే చేయాల్సిన పనులు హోలీ

    అందం

    రాపిడి వల్ల తొడల మధ్య కలిగే దురదతో పాటు ఇతర సమస్యలను దూరం చేసే టాల్కం పౌడర్ లైఫ్-స్టైల్
    కొనదేలిన ముక్కు కోసం లక్షలు ఖర్చు పెట్టకుండా ఈ విధంగా ట్రై చేయండి లైఫ్-స్టైల్
    పొద్దున్న వేసుకున్న మేకప్ సాయంత్రానికల్లా తొలగిపోతుంటే పాటించాల్సిన చిట్కాలు లైఫ్-స్టైల్
    అందం: అఫారెస్ట్ గ్రీన్ కాఫీ టోనింగ్ ఫేస్ మిస్ట్ రివ్యూ లైఫ్-స్టైల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025