Branded houses: హైదరాబాద్‌లో వేగంగా విస్తరిస్తున్న బ్రాండెడ్ గృహాలు
ఈ వార్తాకథనం ఏంటి
విలాసవంతమైన గృహ నిర్మాణాల్లో కొత్త ట్రెండ్ కనిపిస్తోంది.
ఐదు నక్షత్రాల హోటల్స్ రేటింగ్ కలిగిన నివాసాలను నిర్మించేందుకు నిర్మాణ సంస్థలు ప్రసిద్ధ అతిథ్య సంస్థలతో కలిసి పనిచేస్తున్నాయి.
ఈ భాగస్వామ్యంతో డిజైనింగ్ ప్రమాణాలను పెంచడంతో పాటు, నివాసితులకు స్టార్ హోటల్స్‌లో ఉండేలా అత్యుత్తమ సేవలను అందించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాయి.
లగ్జరీ ట్యాగ్‌తో రియల్ ఎస్టేట్ మార్కెట్
ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగంలో లగ్జరీ అనేది ప్రతీ ప్రాజెక్ట్‌లో వినిపిస్తోంది. కానీ క్రెడాయ్ వర్గాల అభిప్రాయం ప్రకారం, ఈ ట్యాగ్ తన గౌరవాన్ని కోల్పోయింది.
నిజమైన లగ్జరీను అందించే ప్రాజెక్టులు మాత్రమే ప్రత్యేకంగా నిలుస్తున్నాయి.
కొనుగోలుదారులు కూడా అంతర్జాతీయ అనుభవాలను పొందుతూ, విలాసవంతమైన జీవన విధానంపై స్పష్టత పెంచుకున్నారట.
Details
ప్రసిద్ధ సంస్థల భాగస్వామ్యం
రియల్ ఎస్టేట్ డెవలపర్లు మారియట్, రిడ్జ్ కార్ల్‌టన్, లీలా, తాజ్ వంటి హోటల్ బ్రాండ్స్‌తో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు.
ఈ ఒప్పందాలు ప్రధానంగా డిజైన్ ప్రమాణాలు, సాంకేతికత సేవలు, స్థిరాస్తుల నిర్వహణ, అద్దె వ్యవహారాలపై ఆధారపడుతున్నాయి.
హైదరాబాద్ వంటి మహానగరాల్లో ఈ పోకడ వేగంగా విస్తరిస్తోంది.
కోవిడ్ తర్వాత పెరిగిన డిమాండ్
కొవిడ్ మహమ్మారి తర్వాత విలాసవంతమైన ఇళ్ల అమ్మకాలు ఊహించని రీతిలో పెరిగాయి. ఇతర విభాగాల అమ్మకాలపై ప్రభావం పడినా, లగ్జరీ హౌసింగ్ విభాగం మాత్రం స్థిరంగా పెరుగుతూ ఉంది.
4,000 నుంచి 15,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ఇళ్లు విశాలంగా ఉన్నా, సేవల పరంగా కొంత అసంతృప్తి ఉండేది. దీనిని బ్రాండెడ్ హౌసింగ్ ప్రాజెక్టులు అధిగమిస్తున్నాయి.
Details
డెవలపర్లకు ప్రయోజనాలు
స్టార్ హోటల్ బ్రాండ్లతో ఒప్పందం వల్ల డెవలపర్లు మార్కెట్‌లో విశ్వసనీయతను పొందగలుగుతారు.
అంతేకాకుండా ఆర్కిటెక్చర్, ఇంటీరియర్ డిజైన్, పర్యావరణ హిత నిర్మాణ పద్ధతుల్లో ప్రామాణికత సాధించేందుకు ఈ భాగస్వామ్యం సహకరిస్తుంది.
ప్రతిష్ట కోసం బ్రాండెడ్ హౌసింగ్
గేటెడ్ కమ్యూనిటీల నుంచి మరింత అభివృద్ధి చెందుతున్న బ్రాండెడ్ హౌసింగ్ ప్రాజెక్టులు, అక్కడ నివాసం ఉండేవారికి ప్రతిష్టను కల్పిస్తున్నాయి.
నైట్ ఫ్రాంక్ నివేదిక ప్రకారం 2025 నాటికి భారతదేశంలో అల్ట్రా హై నెట్‌వర్త్ వ్యక్తుల సంఖ్య 63% పెరుగుతుందని అంచనా.
Details
ప్రపంచస్థాయి సౌకర్యాలు
ఈ బ్రాండెడ్ హౌమ్స్‌లో ఉపయోగించే వస్తువుల నుండి సాంకేతికత దాకా ప్రతీది అధిక ప్రమాణాల్లో ఉంటుంది.
అపార్ట్‌మెంట్లు, హోటల్స్‌ని కలిపి నిర్మించడం వంటి ప్రత్యేక డిజైన్లు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. స్పాలు, బార్ లాంజ్‌లు, ప్రపంచస్థాయి షాపింగ్ అనుభవం, రెస్టారెంట్లు వంటి సేవలు వీటిలో ఉంటాయి.
ప్రధాన ప్రదేశాల్లో బ్రాండెడ్ హౌసెస్
బ్రాండెడ్ హౌసింగ్ ప్రాజెక్టులు ప్రధానంగా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి వంటి ప్రముఖ ప్రాంతాల్లో అభివృద్ధి చెందుతున్నాయి.
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో వీటి వాటా 10 శాతంగా ఉంది.
గ్లోబల్ మార్కెట్లో బ్రాండెడ్ హౌసింగ్ ప్రస్తుతం 3శాతం వాటాను కలిగి ఉండగా, రాబోయే రోజుల్లో ఇది మరింత పెరుగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.