NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / Father's day 2024 : ఫాదర్స్ డేని ఇంట్లో ఇలా జరుపుకోండి, ఇక చూడండి నాన్న ఎంత సంతోషంగా ఉంటారో.. 
    తదుపరి వార్తా కథనం
    Father's day 2024 : ఫాదర్స్ డేని ఇంట్లో ఇలా జరుపుకోండి, ఇక చూడండి నాన్న ఎంత సంతోషంగా ఉంటారో.. 
    ఫాదర్స్ డేని ఇంట్లో ఇలా జరుపుకోండి, ఇక చూడండి నాన్న ఎంత సంతోషంగా ఉంటారో..

    Father's day 2024 : ఫాదర్స్ డేని ఇంట్లో ఇలా జరుపుకోండి, ఇక చూడండి నాన్న ఎంత సంతోషంగా ఉంటారో.. 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jun 11, 2024
    11:57 am

    ఈ వార్తాకథనం ఏంటి

    చిన్నతనంలో మన తల్లిదండ్రులతో కాలక్షేపం చేసి ఉంటాం. కానీ మనం పెద్దయ్యాక చదువు, ఉద్యోగం, పెళ్లి వంటి వాటికే ఎక్కువ సమయం కేటాయించడం మొదలవుతుంది.

    తల్లిదండ్రులతో కూర్చొని వారితో మాట్లాడేందుకు కూడా సమయం దొరకని వారు చాలా మంది ఉన్నారు.

    ఎందుకంటే వారు తమ తమ పనిలో చాలా బిజీగా ఉంటారు. కాబట్టి అటువంటి పరిస్థితిలో, వారు ఫాదర్స్ డే వంటి ప్రత్యేక సందర్భాలలో తమ తల్లిదండ్రుల కోసం సమయాన్ని వెచ్చించవచ్చు.

    ఈ ఏడాది జూన్ 16న ఫాదర్స్ డే జరుపుకోనున్నారు. అటువంటి పరిస్థితిలో,ఇంటి బాధ్యతను నిర్వర్తించే, ప్రతి ఒక్కరినీ చూసుకునే తండ్రి కోసం మీరు ఈ రోజును ప్రత్యేకంగా చేయవచ్చు.

    వివరాలు 

    సినిమా బెస్ట్ ఆప్షన్

    మీరు మీ నాన్నగారిని బయటకి ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. మీరు వారి రోజును ప్రత్యేకంగా చేయడానికి ఇంట్లో కూడా ఈ చిట్కాలను అనుసరించవచ్చు.

    మీ తండ్రి కోసం మీ బిజీ షెడ్యూల్ నుండి కొంత సమయం కేటాయించండి. ఇంట్లో అయనతో గడపండి. ఇది ఆయనకి చాలా మంచి అనుభూతిని కలిగిస్తుంది.

    దీనికి సినిమా బెస్ట్ ఆప్షన్. మీ నాన్నగారికి సినిమాలు చూడటం ఇష్టమైతే, ఆయనతో కూర్చుని ఆయనకు ఇష్టమైన సినిమా చూడండి.

    తల్లిదండ్రులు తమ పిల్లల ఆహార ఎంపికపై ఎల్లప్పుడూ శ్రద్ధ వహిస్తారు.రాత్రి భోజనానికి ఏమి వండాలి అని అమ్మ నాన్నను అడిగినప్పుడల్లా, వారు మీకు నచ్చిన ఆహారాన్ని వండమని అంటారు.

    వివరాలు 

    ఇష్టమైన సంగీతాన్ని ప్లే చెయ్యండి

    అటువంటి పరిస్థితిలో,ఈ సందర్భంగా లంచ్ లేదా డిన్నర్ కోసం ప్లాన్ చేయండి. వీలైతే, వారికి నచ్చిన ఆహారాన్ని మీరే తయారు చేసి,వారికి అందించండి. వారి రోజును ప్రత్యేకంగా చేయడానికి ఇది ఉత్తమ ఎంపికలలో ఒకటి.

    తండ్రి తరచుగా పిల్లలకు బహుమతులు ఇస్తాడు. వారి అవసరాలు,ఎంపికలన్నింటినీ వారికి అందిస్తాడు. అయితే మీరు మీ తండ్రికి కూడా బహుమతి ఇవ్వాలి. ఫాదర్స్ డే దీనికి సరైన రోజు. మీ నాన్నగారి ముఖంలో చిరునవ్వు తెప్పించేలా ఏదైనా చెయ్యాలి.

    ఫాదర్స్ డేని ప్రత్యేకంగా చేయడానికి,మీరు ఇంట్లో పార్టీని ప్లాన్ చేసుకోవచ్చు.ఇందులో మీ కుటుంబం మొత్తం పూర్తి స్థాయిలో ఆనందించవచ్చు.

    మీరు పార్టీలో వారికి ఇష్టమైన సంగీతాన్ని ప్లే చెయ్యండి.ఇది విన్న తర్వాత వారు మంచి అనుభూతి చెందుతారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ముఖ్యమైన తేదీలు

    తాజా

    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ
    Mumbai Indians: ముంబయి జట్టులో కీలక మార్పులు.. ముగ్గురు నూతన ఆటగాళ్లకు అవకాశం ముంబయి ఇండియన్స్

    ముఖ్యమైన తేదీలు

    ఎక్కువ మందికి తెలియని అతి పురాతనమైన  వింతగా ఉండే సంగీత సాధనాలు  జీవనశైలి
    ఇంటర్నేషనల్ ఒలింపిక్ డే 2023: ఒలింపిక్ దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా?  జీవనశైలి
    అంతర్జాతీయ మాదకద్రవ్యాలు దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం గురించి తెలుసుకోవాల్సిన విషయాలు  లైఫ్-స్టైల్
    వరల్డ్ ఆస్టరాయిడ్ డే ఎందుకు జరుపుతారు? దాని వెనక చరిత్ర ఏంటి?  లైఫ్-స్టైల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025