ముక్కు పొడిబారడం: ముక్కులో దురద, ముక్కు నుండి రక్తం కారడం వంటి సమస్యలను దూరం చేసే ఇంటి చిట్కాలు
ముక్కులో తేమ తగ్గిపోవడాన్ని ముక్కు పొడిబారడం అంటారు. ఈ సమస్య అనేక సమస్యలకు దారితీస్తుంది. ముక్కు పొడిబారడం వల్ల ముక్కులో దురద కలగడం, రక్తం కారడం, నొప్పిగా అనిపించడం జరుగుతుంది. ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఉన్నవారు ఈ సమస్య బారిన పడతారు. అలాగే పొగత్రాగడం, గంజాయి మొదలగు అలవాట్లు ఉన్నవారిలో ఇలాంటి ఇబ్బంది కలుగుతుంది. అయితే ఈ సమస్యను ఇంటి చిట్కాల ద్వారా తగ్గించుకోవచ్చు. అవేంటో ఇక్కడ చూద్దాం. కొబ్బరినూనె: కొబ్బరి నూనెను గోరువెచ్చగా వేడి చేసి చెవిపుల్ల సాయంతో ముక్కు లోపల మర్దన చేయాలి. రోజుకు రెండుసార్లు చేస్తే పొడిబారిన ముక్కు తేమగా మారుతుంది.
ముక్కు పొడిబారడం సమస్యను ప్రభావ వంతంగా తగ్గించే ఆవిరి పీల్చుకోవడం
బాదం నూనె: బాదం నూనె తీసుకొని దానికి కొంత కలబంద రసాన్ని జోడించి చెవిపుల్ల సాయంతో ముక్కు లోపల మర్దన చేసుకోవాలి.కలబంద రసం కారణంగా ముక్కులో దురద పెట్టడం తగ్గిపోతుంది. సముద్రపు ఉప్పు: సముద్రపు ఉప్పును నీళ్లలో కలిపి ఒక బాటిల్లో ఉంచుకోవాలి. ఆ బాటిల్ ని బాగా షేక్ చేసి, ఆ ఉప్పునీళ్లను ముక్కు పైన స్ప్రే చేసుకోవాలి. దీనివల్ల మంచి ఉపశమనం లభించి ముక్కులో పొడిదనం పోయి తేమగా తయారవుతుంది. ఆవిరి పీల్చుకోవడం: ఒక పాత్రలో నీటిని బాగా వేడి చేసి, దాన్నుండి వచ్చే ఆవిరిని 10నిమిషాల పాటు పీల్చుకుంటే ముక్కు పొడిబారడం అనే సమస్య చాలా తొందరగా దూరమవుతుంది.