Winter Immunity Boosting Drinks: చలికాలంలో రోగనిరోధక శక్తిని పెంచే ఐదు పానీయాలివే!
ఈ వార్తాకథనం ఏంటి
చలికాలం మొదలైంది. రోజురోజుకూ చలి తీవ్రత పెరుగుతోంది. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ప్రజలు చలితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీని ప్రభావంతో ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ కాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచుతూ రోగనిరోధక శక్తిని పెంచడం చాలా ముఖ్యం. అందుకే నిపుణులు సూచిస్తున్న కొన్ని పానీయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Details
క్యారెట్, బీట్‌రూట్ జ్యూస్
నిపుణుల ప్రకారం, శీతాకాలంలో క్యారెట్, బీట్‌రూట్ జ్యూస్‌ను తప్పనిసరిగా ఆహారంలో చేర్చాలి. ఈ జ్యూస్ రోగనిరోధక శక్తిని పెంచుతుంది, జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తుంది. అలాగే చర్మానికి కావలసిన కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది, దీనివల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. అంతేకాక, మలబద్ధకం సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. నారింజ, తులసి జ్యూస్ శీతాకాలంలో నారింజ, తులసి జ్యూస్ తీసుకోవడం చాలా ప్రయోజనకరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ పానీయం మారుతున్న వాతావరణం వల్ల కలిగే జలుబు, దగ్గు, ఫ్లూ వంటి అంటు వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంపొందించి, శరీరానికి అవసరమైన విటమిన్ C అందిస్తుంది.
Details
దోసకాయ, పాలకూర జ్యూస్
దోసకాయ, పాలకూర జ్యూస్ శరీరానికి శక్తినిచ్చే పానీయం. ఇవి శరీరాన్ని చురుకుగా ఉంచి, జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయి. పాలకూరలో ఉండే ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు రక్త ప్రసరణను సక్రమంగా నిర్వహించడంలో సహాయపడతాయి. నిమ్మకాయ-తేనె నీరు గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, తేనె కలిపి తాగడం శీతాకాలంలో అత్యంత ఆరోగ్యకరమైన అలవాటు. ఇది శరీరంలోని విషపదార్థాలను తొలగిస్తుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంపొందించి శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది.
Details
కషాయం (తులసి, అల్లం, మిరియాలు, తేనెతో)
తులసి, నల్లమిరియాలు, అల్లం, తేనెతో తయారు చేసే కషాయం శీతాకాలంలో చలికి సహజ వైద్యం లాంటిది. ఇది జీర్ణవ్యవస్థను ఉత్తేజపరుస్తుంది, గొంతు నొప్పి, జలుబు వంటి సమస్యలకు ఉపశమనం కలిగిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచి శరీరాన్ని చలికి రక్షిస్తుంది. మొత్తం మీద ఈ పానీయాలు శరీరానికి వేడి అందించడమే కాకుండా, రోగనిరోధక శక్తిని పెంచి చలి ప్రభావం నుండి రక్షిస్తాయి. శీతాకాలంలో వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది.