Holi Special Snack Recipes:ఈ ఒక్క పిండితో ఐదు రకాల రుచికరమైన స్నాక్స్ తయారు చేసుకోవచ్చు..
ఈ వార్తాకథనం ఏంటి
సంవత్సరం పొడవునా ఎదురుచూసిన హోలీ పండుగకు ఇంకొన్ని గంటల మాత్రమే మిగిలి ఉంది.
ఈ రంగుల పండుగను పిల్లలు మాత్రమే కాదు,పెద్దలు కూడా ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు.
స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యులు ఒకచోట కలిసి ఆనందంగా గడుపుతారు.
పరస్పరం ఇంటికెళ్లి రంగులతో ఆడుకుంటారు. ఇలాంటి సందర్భాల్లో ఉత్సాహంతో పాటు రుచికరమైన ఆహారం కూడా కీలక పాత్ర పోషిస్తుంది.
హోలీ రోజున ఇంటికి వచ్చిన అతిథులకు ప్రత్యేక వంటకాలను వడ్డించడం సంప్రదాయంగా కొనసాగుతోంది.
వివరాలు
ఐదు రకాల విభిన్నమైన స్నాక్స్
హోలీ స్పెషల్ వంటకాలలో పిండి స్నాక్స్‌కి ప్రాముఖ్యత ఎక్కువ. సాయంత్రం వేళ అందరూ కలిసి కూర్చొని ఒక వేడి వేడి, క్రిస్పీ, స్వాదిష్టమైన వంటకం తినాలనుకుంటారు.
ఇలాంటి వేళకు సరైన టిఫిన్, స్నాక్స్ చాలా రుచిగా అనిపిస్తాయి. మీరు కూడా ఈ హోలీకి ఇంట్లోనే రుచికరమైన స్నాక్స్ తయారు చేయాలని అనుకుంటే, ఈ చిట్కాలతో ఐదు రకాల విభిన్నమైన స్నాక్స్‌ను సులభంగా తయారు చేసుకోవచ్చు.
పెద్దగా శ్రమ లేకుండా ఒకే రకమైన పిండితో విభిన్నమైన రుచులను సృష్టించుకోవచ్చు. ఇంటికి వచ్చే అతిథులకు ప్లేటు నిండా వీటిని వడ్డించండి. మరి ఎలా తయారు చేయాలో చూద్దామా!
వివరాలు
పిండి తయారీకి కావలసిన పదార్థాలు:
శనగపిండి (ఒక కప్పు, సుమారు 250 గ్రాములు),
ఉప్పు (రుచికి తగినట్లు),
కొత్తిమీర,
ఎర్ర మిర్చి పొడి (అర టీస్పూన్),
జీలకర్ర పోడి(అర టీస్పూన్),
పసుపు (1/4 టీస్పూన్),
ఇంగువ (చిటికెడు),
చిల్లీ ఫ్లేక్స్ (అర టీస్పూన్),
వాము (అర టీస్పూన్),
ఆమ్‌చూర్ పొడి(అర టీస్పూన్)
నీరు, నూనె (ఒక టీస్పూన్).
అదనంగా ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, పాలకూర, పెద్ద మిర్చీ, అరటికాయ వంటి మీకు నచ్చిన కూరగయాలు
వివరాలు
పిండిని కలిపే విధానం..
ఒక పెద్ద గిన్నెలో శనగపిండిని తీసుకుని అందులో కొత్తిమీర,ఉప్పు,ఎర్ర మిర్చి పొడి,పసుపు,ఇంగువ, చిల్లీ ఫ్లేక్స్,వాము కలిపి బాగా మిక్స్ చేయండి.
తర్వాత కొద్దికొద్దిగా నీరు పోస్తూ, గడ్డలు రానీయకుండా మిశ్రమాన్ని కలపండి. ఈ మిశ్రమాన్ని 10నిమిషాలు పక్కన పెట్టండి.
ఇదివరకు తీసుకున్న కూరగాయలను శుభ్రంగా కట్ చేసి సిద్ధం చేసుకోండి.
ఒక చిన్న బౌల్‌లో కారం పొడి, ఆమ్‌చూర్ పొడి, ఉప్పు, జీలకర్ర పొడి కలిపి మసాలా మిశ్రమాన్ని తయారు చేయండి.
ఈ మసాలాను కోసిన కూరగాయలపై అప్లై చేయండి, తద్వారా పకోడీలు, బజ్జీలు మరింత రుచిగా ఉంటాయి.
ఇప్పుడు శనగపిండి మిశ్రమంలో ఒక చెంచా వేడి నూనె కలిపి మళ్లీ మిక్స్ చేయండి.ఇది పకోడీలు, బజ్జీలు మరింత క్రిస్పీగా మారేందుకు సహాయపడుతుంది.
వివరాలు
పిండిని కలిపే విధానం..
ఈ మిశ్రమంతో మీరు బంగాళాదుంప బజ్జీలు, ఉల్లిపాయ పకోడీలు, పాలకూర పకోడీలు, మిర్చి బజ్జీలు, టమాటో బజ్జీ, కొత్తిమీర పకోడీ, అరటికాయ బజ్జీ వంటి రకరకాల స్నాక్స్ తయారు చేయవచ్చు.
కూరగాయలను పిండిలో ముంచి వేడిగా ఉన్న నూనెలో వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించండి.