Flaxseeds for Weight loss: అవిసె గింజలు.. బరువు తగ్గాలనుకునే వారికీ వరం
బరువు తగ్గాలనుకునే వారు సరైన డైట్, వ్యాయామాల పద్ధతులను క్రమంగా పాటించాలి. కొన్ని ఆహార పదార్థాలు వేగంగా ఫలితాలను అందించవచ్చు. వాటిలో 'అవిసె గింజలు' (ఫ్లాక్స్ సీడ్స్) ను రెగ్యులర్‌గా తీసుకోవడం వలన బరువు తగ్గేందుకు మంచి సహకారం లభిస్తుంది. అవిసె గింజల్లో ప్రోటీన్, ఫైబర్, ఫ్యాటీ యాసిడ్లు (ఓమేగా-3, ఓమేగా-6) చాలా పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి అవసరమైన విటమిన్లు, మినరల్స్‌ను అందించి, ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అలాగే, బరువు తగ్గటానికి అవిసె గింజలు చాలా ప్రభావవంతమైనవి.
బరువు తగ్గేందుకు అవిసె గింజలు ఎలా సహాయపడతాయి?
ఓమేగా-3, ఓమేగా-6 ఫ్యాటీ యాసిడ్లు: ఇవి శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో మరియు జీవక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఫైబర్: అవిసె గింజల్లో ఉన్న అధిక ఫైబర్ జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది మరియు ఆకలిని నియంత్రిస్తుంది. ప్రోటీన్: అవిసె గింజలలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
అవిసె గింజలను ఎలా తీసుకోవచ్చు?
అవిసె గింజలను నేరుగా లేదా సన్నటి మంటపై వేయించి తీసుకోవచ్చు. ఒక గిన్నెలో నీటిని మరిగించాలి. దానిలో ఒక టేబుల్ స్పూన్ అవిసె గింజల పొడి, కొంచెం యాలకులు వేసి 5 నిమిషాలు మరిగించాలి. తర్వాత ఈ టీని వడగట్టి తాగండి. రుచికి తేనె లేదా నిమ్మరసం కూడా జోడించవచ్చు. పెరుగులో అవిసె గింజలను కలిపి తినడం చాలా సులభం. ఇది బరువు తగ్గడంలో సహాయపడుతుంది. రాత్రిపూట అవిసె గింజలను నీటిలో నానబెట్టి, ఉదయాన్నే ఆ నీటిని తాగడం మంచిది. ఇది గింజల పోషకాలను పూర్తిగా శరీరానికి అందిస్తుంది. పండ్ల, కూరగాయల స్మూతీలలో అవిసె గింజలను చేర్చుకోవడం కూడా మంచిది. ఇవి పోషక విలువలను పెంచుతాయి.ఆకలి నియంత్రణకు సహాయపడతాయి.