మోచేతుల దగ్గర చర్మం మెరవాలంటే ఈ చిట్కాలను పాటించండి!
మోచేతులు, మోకాళ్ల దగ్గర ఉండే చర్మం నల్లగా మారడంతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. దాని నియంత్రణ కోసం అనేక ప్రయత్నాలు చేసినా ఆశించిన ఫలితం రాకపోవడంతో పలువురు నిరాశకు గురవుతారు. అలాంటి వారు కొన్ని చిట్కాలను పాటిస్తే మంచి ఫలితం ఉండే అవకాశం ఉందని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం ఆ చిట్కాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మోచేతులు, మోకాళ్ల దగ్గర చర్మం నల్లగా మారడానికి ఆ ప్రాంతాల్లో చర్మ సంరక్షణ గురించి శ్రద్ధ తీసుకోకపోవడం ముఖ్యం కారణం. మృతకణాలు పేరుకుపోవడం, హైపర్ పిగ్మెంటేషన్, ఎండలో ఎక్కువగా తిరగడం, ఎగ్జిమా, సోరియాసిన్ లాంటివి కూడా చర్మం నల్లగా ఉండటానికి కారణం కావచ్చు.
ఈ 5 పదార్థాలను వాడితే చర్మం నలుగు క్రమంగా తగ్గిపోతోంది
1. మల్బెర్రీ ఎక్స్ట్రాక్ట్ చర్మంలోని మెలనిన్ సింథసిస్‌ను నియంత్రిస్తుంది. ఇది నల్లమచ్చలను తొలిగించడంలో సహాయపడుతుంది. అసమాన చర్మపు రంగుపై సమర్థవంతంగా పనిచేస్తుంది. 2. కలబంద: ఇందులో సహజంగానే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలుంటాయి. పొడిచర్మం సమస్యను తగ్గిస్తుంది. చర్మం మీదున్న నలుపు తగ్గిస్తుంది. 3. కొకొవా బటర్: సహజయాంటీ ఆక్సిడెంట్లు, శ్యాచురేటెడ్ కొవ్వులు, విటమిన్ కె, ఇ ఇందులో ఉంటాయి. అదేవిధంగా పిగ్మెంటేషన్ సమస్య ఇది తగ్గిస్తుంది. 4. షియా బటర్: ఇది సహజ ఎమల్సిఫైయర్. చర్మాన్ని తేమగా ఉంచి, పొడి చర్మం సమస్యను తగ్గిస్తుంది. 5. విటమిన్ ఇ: ఇది యాంటీ ఆక్సిడెంట్ లక్షణం కలిగి ఉన్నవిటమిన్. చర్మాన్ని మృదువుగా మార్చి, చర్మం తేమ కోల్పోకుండా చేస్తుంది.